Bigg boss 5 : ఎప్పుడెప్పుడా అని బిగ్ బాస్ అభిమానులు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ సక్సెస్ అయింది. గత సంవత్సరం థియేటర్లు ఓపెన్ కాని సమయంలో.. ఎంటర్ టైన్ మెంటే లేని సమయంలో.. ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4.. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే.. బిగ్ బాస్ సీజన్ 4 ను మునుపెన్నడూ చూడని రీతిలో.. అన్ని సీజన్లను దాటుకొని.. ఎక్కువ టీఆర్పీని సంపాదించుకోవడమే కాదు.. ఆ సీజన్ కంటెస్టెంట్లకు కూడా మంచి భవిష్యత్తునిచ్చింది. అందుకే.. బిగ్ బాస్ అభిమానులు.. సీజన్ 5 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 రెడీ అయిపోయింది. జులైలో ప్రారంభం అవుతుంది. కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఫైనల్ అయిపోయింది. ఇదే కంటెస్టెంట్ల లిస్టు.. త్వరలోనే కంటెస్టెంట్లను క్వారంటైన్ కు పంపించబోతున్నారు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటుంటే.. నిజమే కాబోలు అని అంతా అనుకున్నారు. జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఎలాగైనా త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం అవుతుంది.. అని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం బిగ్ బాస్ అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చేసింది.
నిజం చెప్పాలంటే.. అసలు బిగ్ బాస్ సెట్ నే ఇంకా వేయలేదట. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ సీజన్ 5 సెట్ పనులు ప్రారంభం అయ్యాయట. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ సెట్ ను నిర్మించడం స్టార్ట్ చేయడంతో అది పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందట. అందుకే.. దాన్ని పక్కన పెట్టి.. బిగ్ బాస్ టైమింగ్ లో వేరే షోను ముందుకు తీసుకొస్తున్నారు. అదే sixth sense show. ఈ షోకు ఓంకార్ హోస్ట్. ఇప్పటికే మూడు సీజన్లను ఈ షో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.
దానికి సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా విడుదల చేశారు. జూన్ 12 నుంచి రాత్రి 9 గంటలకు షో ప్రారంభం కాబోతోంది. ఈ షో ప్రారంభం అయ్యాక కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు కంటిన్యూగా నడుస్తుంది. అంటూ.. సెప్టెంబర్ వరకు ఈ షో ఉండనుంది. దీంతో.. వచ్చే సెప్టెంబర్ దాకా బిగ్ బాస్ ప్రారంభమయ్యే చాన్సే లేదంటున్నారు. అప్పటి వరకు కరోనా తగ్గుముఖం పడితే.. బిగ్ బాస్ సెట్ పనులు పూర్తయితే.. అక్టోబర్ లో బిగ్ బాస్ షోను ప్రారంభించాలని యాజమాన్యం యోచిస్తోందట. అప్పటి వరకు కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ అభిమానులు ఇంకో మూడు నాలుగు నెలలు వెయిట్ చేయాల్సిందే. తప్పదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.