Jabardasth : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నది అయితే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. వీళ్ల తర్వాత అంత స్థాయిలో గుర్తింపు లేకున్నా.. కొద్దో గొప్పో తమ పంచులతో గుర్తింపు తెచ్చుకున్నారు అధిరే అభి, ఆటో రామ్ ప్రసాద్. ఇద్దరు కూడా జబర్దస్త్ లో పాపులర్ నటులే. సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆటో రామ్ ప్రసాద్ చేస్తుంటాడు. అధిరే అభి మాత్రం టీమ్ లీడర్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే.. వీళ్లిద్దరు ఇండస్ట్రీలోకి రావడానికి ఎంత కష్టపడ్డారు.. అనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు.. వీళ్ల నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. వీళ్లు జబర్దస్త్ కామెడీ షోలో ప్రేక్షకులకు నవ్వులు పండించడం కోసం ఎంత కష్టపడతారు. అసలు వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఆలీతో సరదాగా ఆనే షోలో ఆలీతో పంచుకున్నారు.
ఆటో రామ్ ప్రసాద్.. తను ఇండస్ట్రీకి రాకముందు.. ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడట. ఆ తర్వాత ఎడిటర్ గా వర్క్ చేసి.. అక్కడి నుంచి జబర్దస్త్ లో చేరాడట. జబర్దస్త్ లో చేరాకనే ఆటో రామ్ ప్రసాద్ కు మంచి గుర్తింపు లభించింది. అయితే.. తన పంచుల వెనుక కథ ఏంటి? తన పేరుకు ముందు ఆటో అని ఎందుకు వచ్చింది? అనే విషయాలను ఆలీతో పంచుకున్నాడు. మనం ఏం కావాలి అనేది మనం డిసైడ్ కాకూడదు. ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుంది.. అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చాడు రామ్ ప్రసాద్.
అధిరే అభి.. నిజానికి సినిమాలతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈశ్వర్ సినిమాతో తను కూడా తొలిసారి కెమెరా ముందు నటించాడు. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ, అభి ఎంట్రీ ఒకేసారి జరుగుతుందట. ఇద్దరూ కలిసి ఒకే కెమెరాలో ఒకే షాట్ లో పాల్గొన్నారట. మీకో విషయం తెలుసా? అధిరే అభి.. బాహుబలి సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. అయితే.. ఒక సినిమా కోసం అని చెప్పి నమ్మి.. 5 లక్షలు ఇచ్చి అడ్డంగా మోసపోయాడట అభి. ఆ డబ్బుల కోసం పోలీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందట.
ఇక.. తను ఆర్టిస్ట్ అవ్వాలని బాగా కోరికతో ఉండేవాడట అభి. అయితే.. ఒకసారి ఓ ఈవెంట్ లో నాగేశ్వరరావును చూసి.. ఆయన దగ్గరికి వెళ్లి.. ఆయన కాళ్లకు మొక్కి.. ఆర్టిస్ట్ కావాలని దీవించండి.. అని అడిగాడట అభి. దానికి సమాధానంగా.. కాళ్లు మొక్కినంత మాత్రాన ఆర్టిస్ట్ కాలేవు.. అంటూ అక్కినేని నాగేశ్వరరావు అనడంతో బిక్క మొహం వేశాడట అభి. ఇలా.. ఇండస్ట్రీకి సంబంధించి తమ అనుభవాలను ఆలీతో పంచుకున్నారు వీళ్లిద్దరు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.