Social Media : రేపు ఫేస్ బుక్, ట్విట్టర్ బంద్.. ఇండియాలో సోషల్ మీడియా సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
Social Media : సోషల్ మీడియాను వాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అసలే కరోనా కాలం. లాక్ డౌన్. బయటికి వెళ్లే అవకాశం లేనప్పుడు.. ఇంట్లో ఖాళీ ఉండి చేసేదేం ఉంటుంది. అందుకే.. అందరూ సోషల్ మీడియాకే అతుక్కుపోతున్నారు. అయితే.. సోషల్ మీడియా యూజర్లందరికీ షాక్ ఇస్తూ… ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ రేపు పనిచేయవు. రేపు అవి బంద్ కానున్నాయి.
ఎందుకంటే.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ.. సోషల్ మీడియా నెట్ వర్క్స్ కు గత ఫిబ్రవరి 25నే ఒక గెజిట్ రిలీజ్ చేసింది. ఇండియాలో సోషల్ మీడియా నెట్ వర్క్స్ తమ కార్యకలాపాలను సాగించాలంటే.. కేంద్రం ఆదేశించిన ప్రకారం.. ఆ రూల్స్ ను పాటించాల్సిందే అని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న గెజిట్ జారీ చేసి.. ఇండియాలో ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు మూడు నెలలు గడువు ఇస్తూ.. ఆలోపు ఇండియా రూల్స్ కు ఓకే చెప్పాలని తెలిపింది.
మూడు నెలల గడుపు మే 25తో అంటే ఈరోజుతో ముగియనుంది. మే 25 లోపల కేంద్రం సూచించిన రూల్స్ ను ఫాలో కాకపోతే.. ఆ సోషల్ మీడియా సైట్ ను ఇండియాలో బ్యాన్ చేయడంతో పాటు.. వాటిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు ఆలోచించబోమని కేంద్రం హెచ్చరించింది. ఐటీ రూల్స్ ఫాలో అవ్వడంతో పాటు.. రూల్స్ కు సంబంధించి.. ఒక స్టాఫ్ కూడా ఉండాలని.. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియా సంస్థ.. రూల్స్ ను అతిక్రమించకుండా.. చూసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపించాలని గెజిట్ లో పేర్కొంది.
Social Media : సోషల్ మీడియా సంస్థలకు గడువు పెంచుతారా? లేక బ్లాక్ చేస్తారా?
అయితే.. ఇప్పటి వరకు ఒక్క కూ(KOO) అనే సోషల్ మీడియా సంస్థ తప్పితే.. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ లలో ఏది కూడా కొత్త రూల్స్ ను, కొత్త రెగ్యులేషన్స్ ను ఫాలో అవడం లేదు. ఐటీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన గెజిట్ లోని కొన్ని రూల్స్ గురించి ప్రభుత్వంతో చర్చించాల్సి ఉందని.. అందుకే ఇంకా కొత్త రూల్స్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫేస్ బుక్ వెల్లడించింది. ట్విట్టర్ కూడా ఇంచుమించు అటువంటి సమాధానమే చెప్పడంతో పాటు.. తమకు మరో మూడు నెలల సమయం కావాలని అవి ప్రభుత్వాన్ని కోరాయి.
ఏది ఏమైనా.. ప్రభుత్వం ఇచ్చిన గడుపు మే 25 తో ముగుస్తుండటంతో.. ఇప్పటివరకు రూల్స్ ఫాలో విషయంలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. రేపు ఈ నాలుగు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఇండియాలో బ్లాక్ చేస్తారని తెలుస్తోంది. వాటిని ఇండియాలో బ్లాక్ చేస్తేనే.. రూల్స్ విషయంలో వాళ్లు ఇండియా మాట వింటారని.. లేకపోతే.. తమ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ఆదేశాలనే పాటిస్తారని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.