AP BJP : సోము వీర్రాజు ఔట్.. ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టే నిఖార్సయిన నాయకుడే లేడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP BJP : సోము వీర్రాజు ఔట్.. ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టే నిఖార్సయిన నాయకుడే లేడా?

సోము వీర్రాజుకు ఊస్టింగేనా… AP BJP : ఏపీ బీజేపీ సార‌థిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేత‌కు ప‌ట్టం క‌డ‌తారా? ఏపీలో బీజేపీని ప‌రుగులు పెట్టించే నాయ‌కుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఏపీ సార‌థిగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. కార్పొరేష‌న్ […]

 Authored By sukanya | The Telugu News | Updated on :11 August 2021,2:30 pm

సోము వీర్రాజుకు ఊస్టింగేనా…

AP BJP : ఏపీ బీజేపీ సార‌థిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేత‌కు ప‌ట్టం క‌డ‌తారా? ఏపీలో బీజేపీని ప‌రుగులు పెట్టించే నాయ‌కుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఏపీ సార‌థిగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఏ ఎన్నిక‌లోనూ.. బీజేపీ పుంజుకున్న ప‌రిస్థితి లేదు. అదే స‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను బీజేపీపెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

Somu Veerraju placed is replaced by a new leader

Somu Veerraju placed is replaced by a new leader

ఈ క్ర‌మంలో మాజీ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను రంగంలోకి దింపారు. ఉప పోరుకు దాదాపు మూడు మాసాల ముందు నుంచి బీజేపీ నేతలంతా తిరుప‌తిలో మ‌కాం వేసి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే.. ఆ ఉప ఎన్నిక‌లో క‌నీసం మార్కులు కూడా సంపాదించలేక పోయారు. ఇక‌, స్థానికంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో సోము వీర్రాజు నాయ‌క‌త్వంపై, పార్టీ భ‌విత‌పై కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. అదే స‌మయంలో సోము వీర్రాజు.. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌కుండా.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల‌.. అప్ప‌టి వ‌రకు క్ష‌త్రియ‌, క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లో బీజేపీపై ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో సోము వీర్రాజు త‌న సొంత సామాజిక వ‌ర్గాన్న‌యినా.. బీజేపీవైపు మ‌ళ్లించారా ? ఈ విష‌యంలో అయినా స‌క్సెస్ అయ్యారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

కమ్మ, రెడ్డి వర్గాలు.. దూరం..

ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో రాష్ట్ర స్థాయి ఉద్య‌మానికి పిలుపు ఇచ్చినా.. నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించ‌డంలోను, బల‌మైన వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డంలోనూ బీజేపీ చ‌తికిల ప‌డింద‌నే వాద‌న ఉంది. ఇక‌, సోము వీర్రాజు ఏ నినాదం అందుకున్నా.. ఆయ‌న‌ను అనుస‌రించేవారు కూడా ఇటీవ‌ల కాలంలో త‌గ్గిపోయారు. దీంతో ఇక‌, సోము వీర్రాజును ప‌క్క‌న పెట్ట‌డం త‌ప్ప బీజేపీ అధిష్టానం ముందు మ‌రో ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది. దీంతో మ‌రో ఆరేడు నెలల్లోనే సోము వీర్రాజును ప‌క్క‌న పెట్టి.. కీల‌క నేత‌కు ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని బీజేపీ పెద్ద‌లు ఆలోచన చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి, ఆ త‌ర్వాత‌ .. 2సార్లు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు బీజేపీ అధిష్టానం ఏపీలో ప‌గ్గాలు అప్ప‌గించింది.

 

అయితే.. క‌మ్మ నేత కంభంపాటి హ‌రిబాబు.. పార్టీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఒకింత మెరుగైన ఫ‌లితాలే సాధించారు. కానీ, కాపు నాయ‌క‌త్వం తెర‌మీదికి రావ‌డంతో .. క‌మ్మ నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గం అంటీముట్ట‌న‌ట్టు ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తే త‌ప్ప‌.. త‌మ ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం కాద‌ని భావిస్తున్న బీజేపీ త్వ‌ర‌లోనే రాష్ట్ర పార్టీ ప‌గ్గాలను రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు అప్ప‌గించే వ్యూహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది