Sonia gandhi get an idea about ys jagan
దేశంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం కొనసాగుతోంది. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దేశంలో మరింతగా దిగజారింది. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని లేదా బీజేపీ మిత్రపక్షాలను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వీరిద్దరు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ కు సంతృప్తికరమైన ఎన్నికల ఫలితాలు రాలేదు.
Sonia gandhi get an idea about ys jagan
దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి మరే పార్టీకి లేదేమో అనిపిస్తుంది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు ఉప ఎన్నికల్లో మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. తమిళనాట డీఎంకే తో కలిసి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకున్న ఘనత ఏమీ లేదు. మొత్తం క్రెడిట్ అంతా డీఎంకే అధినేత స్టాలిన్ కు వెళ్లింది అనడంలో సందేహం లేదు. ఏపీ ని విడగొట్టిన పాపం మరియు వైకాపా అధినేత వైఎస్ జగన్ ను జైలు పాలు చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా దూసుకు పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు సోనియా గాంధీ కి అర్థం అయ్యి ఉంటుంది. ఆ సమయంలో అనవసరంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీకి దూరం చేయడం జరిగింది. ఒక వేళ సీఎం గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంపిక చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తిరుగు ఉండేది కాదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేది అంటూ కాంగ్రెస్ వర్గాల వారు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిని అలా చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి అంటూ చాలా మంది వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.