వైఎస్ జగన్‌ ఎంత తోపో ఇన్నాళ్ళకి బుద్ధి వచ్చింది సోనియాకి

0
Advertisement

దేశంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం కొనసాగుతోంది. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దేశంలో మరింతగా దిగజారింది. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్‌ షా లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని లేదా బీజేపీ మిత్రపక్షాలను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వీరిద్దరు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ కు సంతృప్తికరమైన ఎన్నికల ఫలితాలు రాలేదు.

మళ్లీ మళ్లీ కాంగ్రెస్‌ కు అవే ఫలితాలు..

Sonia gandhi get an idea about ys jagan
Sonia gandhi get an idea about ys jagan

దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి మరే పార్టీకి లేదేమో అనిపిస్తుంది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు ఉప ఎన్నికల్లో మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. తమిళనాట డీఎంకే తో కలిసి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకున్న ఘనత ఏమీ లేదు. మొత్తం క్రెడిట్ అంతా డీఎంకే అధినేత స్టాలిన్‌ కు వెళ్లింది అనడంలో సందేహం లేదు. ఏపీ ని విడగొట్టిన పాపం మరియు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ను జైలు పాలు చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ జగన్‌ గురించి సోనియా…

ఏపీలో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి దూకుడుగా దూసుకు పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు సోనియా గాంధీ కి అర్థం అయ్యి ఉంటుంది. ఆ సమయంలో అనవసరంగా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని పార్టీకి దూరం చేయడం జరిగింది. ఒక వేళ సీఎం గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంపిక చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తిరుగు ఉండేది కాదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేది అంటూ కాంగ్రెస్ వర్గాల వారు అంటున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని అలా చేయడం వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి అంటూ చాలా మంది వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

Advertisement