దారుణం : మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. బట్టలు విప్పించి సెల్ ఫోన్లో వీడియో తీసి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

దారుణం : మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. బట్టలు విప్పించి సెల్ ఫోన్లో వీడియో తీసి..!

Telangana : సూర్యాపేటలోని మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. బాధితుడి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆ విద్యార్థి సూర్యాపేటలోని వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఇంటి నుంచి హాస్టల్ కు చేరుకున్న సదరు విద్యార్థిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి తీసుకెళ్ళారు. పీకల దాకా తాగి ఉన్న మూర్ఖులు.. ర్యాగింగ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 January 2022,9:27 am

Telangana : సూర్యాపేటలోని మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. బాధితుడి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆ విద్యార్థి సూర్యాపేటలోని వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఇంటి నుంచి హాస్టల్ కు చేరుకున్న సదరు విద్యార్థిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి తీసుకెళ్ళారు.

పీకల దాకా తాగి ఉన్న మూర్ఖులు.. ర్యాగింగ్ పేరిట అతడిని చిత్ర హింసలు పెట్టారు. నీ కులం ఏమిటని అడుగుతూ, అక్కా చెల్లెలు ఎంతమంది వంటి ప్రశ్నలతో వేదించరుం అంతటితో ఆగక… అతడి బట్టలు విప్పించి వారి సెల్‌ఫోన్‌ లలో వీడియోలు తీసుకున్నారు. ఆపై దాడికి పాల్పడటమే కాక అతనికి గుండు గీసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు హైదరాబాద్ లోని తన తండ్రికి ఫోన్ చేయగా…

students ragging in suryapeta medical college in telangana

students ragging in suryapeta medical college in telangana

వారు స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌కు చేరుకుని బాధితుడిని రక్షించారు. ర్యాగింగ్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది