Home » Health » Sudden Young Adult Deaths Whats Causing It In Youngsters
Health

Heart Stroke | యువ‌కులు సడెన్ డెత్‌కి కార‌ణం ఏంటి.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

Authored By
Sam C
The Telugu News | Updated on: September 4, 2025 5:30 pm
Advertisement

Heart Stroke | ఆటలాడుతూ ఓ యువకుడు… డ్యాన్స్ చేస్తూ మరొకరు… నవ్వుతూ మాట్లాడుతున్న సమయంలో ఇంకొకరు… ఇలా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పలువురు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలు మనల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్. పోస్ట్‌మార్టం నిపుణుల పరిశీలనల ప్రకారం, ఆకస్మిక మరణాల వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఇవే

Advertisement

#image_title

పెరిగిన ఒత్తిడి, జీవనశైలి మార్పులు

Advertisement

* వ్యాయామం లేకపోవడం
* అధిక ఒత్తిడి
* తగిన నిద్ర లేకపోవడం
* అనారోగ్యకరమైన ఆహారం

ముందస్తు హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం

Advertisement

అలసట, ఛాతీ నొప్పి, శ్వాసలో తేడాలు వంటి సంకేతాలను పట్టించుకోకపోవడం
చిన్న లక్షణాలనూ పట్టించుకోకుండా ఉండడం

కుటుంబ చరిత్ర, కోవిడ్ ప్రభావం

గుండె జబ్బులకు జెనెటికల్ రిస్క్ ఉన్నవారు
కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో గుండె ధమనుల మీద ప్రభావం
ICMR అధ్యయనం ప్రకారం, కోవిడ్ తర్వాత ఆకస్మిక మరణాలు పెరిగినట్లు నివేదికలు

మద్యం, డ్రగ్స్ వల్ల ప్రమాదం

Advertisement

అధికంగా మద్యం సేవించడం
మాదకద్రవ్యాల వాడకం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం
ఇది గుండె లేదా మెదడులో ధమనులు చీలిపోవడానికి దారితీస్తుంది

కొన్నిసార్లు, గుండెలో పెద్ద ధమని పూర్తిగా మూసుకుపోతుంది. చిన్న రక్తనాళాల సహాయంతో గుండె పనిచేసినా, మొదటి లేదా రెండవ కార్డియాక్ అరెస్ట్‌లోనే మరణించే ప్రమాదం. కార్డియోమయోపతి ఉన్నవారు (గుండె కండరాలు బలహీనంగా మారడం) , వార్మప్ లేకుండా వ్యాయామం చేయడం, మెట్లు ఎక్కడం వంటి శ్రమతో ప్రాణాంతక ప్రమాదం. కొన్ని సందర్భాల్లో గుండె ధమనులు తాత్కాలికంగా మూసుకుపోయి తిరిగి తెరుచుకోవచ్చు. ఇవి పోస్ట్‌మార్టం సమయంలో కనిపించకపోవచ్చు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి