Mango Ice Cream : ఐస్ క్రీమ్స్ ను ఇష్టపడని పిల్లలు ఉండరు. కాని ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ను వివిధ రకాల రసాయనాలతో తయారుచేస్తున్నారు. దీనివలన పిల్లలు అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. అందువలన మనం ఇంట్లో కూడా పిల్లలకు నచ్చే విధంగా ఐస్ క్రీమ్ ను తయారుచేయవచ్చు. అది ఎలాగంటే, మన ఇంట్లో ఒక్క మామిడికాయ ఉంటే చాలు. ఆ మామిడికాయతో సులువుగా ఐస్ క్రీమ్స్ ను చేయవచ్చు. మామిడికాయతో చేసిన ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఎంతో ఈజీగా చేసే ఈ ఐస్ క్రీమ్ ను పిల్లలు కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం…
కావలసిన పదార్ధాలు: 1) మామిడికాయ 2) పుదీనా ఆకులు 3) ఉప్పు 4) వాటర్ 5) పంచదార 6) కార్న్ ఫ్లోర్ 7) నిమ్మకాయ 8) మ్యాంగో ఎసెన్స్ 9) గ్రీన్ ఫుడ్ కలర్ 10) చాట్ మసాలా తయారీ విధానం: ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కను తీసుకొని దాని పై తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటిని మిక్సీజార్ లోకి వేసుకోవాలి. తరువాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, అర టీ స్ఫూన్ బ్లాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ ను వేసుకొని అందులోకి రెండున్నర కప్పుల వాటర్ ను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం అడుగున ఒక బౌల్ పెట్టి, పైన ఒక జల్లెడను ఉంచి పైన పలుచటి క్లాత్ ను వేసి జ్యూస్ మొత్తాన్ని అందులోకి పోసుకొని బాగా పిండుకోవాలి.
ఇలా పిండిన తరువాత క్లాత్ లో ఉన్న పిప్పి మొత్తాన్ని పడవేయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ముప్పావు కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. తరువాత అందులోకి వన్ టేబుల్ స్ఫూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని, ఇందులోనే మనం తీసిపెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ను వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ ను తక్కువ లేదా మీడియం సైజులో పెట్టుకొని పంచదార మొత్తం కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడే ఒక బద్ద నిమ్మ చెక్కను పిండుకొని బాగా కలుపుకోవాలి.ఇలా రెండు నిమిషాలు మాత్రమే గ్యాస్ పై పెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి మ్యాంగో ఎసెన్స్ కాని వెనీలా ఎసెన్స్ కాని వేసుకోవాలి.
తరువాత అందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ ను రెండు, మూడు చుక్కల దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తరువాత ఈ మ్యాంగో జ్యూస్ ను ఐస్ మౌల్డ్స్ లోకి వేసుకొవాలి. తరువాత అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ ను వేసుకోవాలి. ఒకవేళ జ్యూస్ కనుక మిగిలితే అందులో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఐస్ మౌల్డ్స్ లోకి ఈ జ్యూస్ ను కూడా పోసుకొని స్టిక్స్ పెట్టుకోవాలి. ఈ మౌల్డ్స్ అన్నింటిని 8,10 గంటల దాకా డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. తరువాత బయటకు తీస్తే కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.