Mango Ice Cream : పిల్ల‌లు సైతం సులువుగా చేసే క‌చ్చా మ్యాంగో ఐస్ క్రీమ్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mango Ice Cream : పిల్ల‌లు సైతం సులువుగా చేసే క‌చ్చా మ్యాంగో ఐస్ క్రీమ్…

 Authored By anusha | The Telugu News | Updated on :30 June 2022,4:00 pm

Mango Ice Cream : ఐస్ క్రీమ్స్ ను ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌లు ఉండ‌రు. కాని ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ను వివిధ ర‌కాల ర‌సాయ‌నాల‌తో త‌యారుచేస్తున్నారు. దీనివ‌ల‌న పిల్ల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గురి అవుతున్నారు. అందువ‌ల‌న మ‌నం ఇంట్లో కూడా పిల్ల‌ల‌కు న‌చ్చే విధంగా ఐస్ క్రీమ్ ను త‌యారుచేయ‌వ‌చ్చు. అది ఎలాగంటే, మ‌న ఇంట్లో ఒక్క మామిడికాయ ఉంటే చాలు. ఆ మామిడికాయ‌తో సులువుగా ఐస్ క్రీమ్స్ ను చేయ‌వ‌చ్చు. మామిడికాయ‌తో చేసిన ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఎంతో ఈజీగా చేసే ఈ ఐస్ క్రీమ్ ను పిల్ల‌లు కూడా చేయ‌వ‌చ్చు. అయితే ఇప్పుడు క‌చ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఎలా చేసుకోవాలి, దానికి కావ‌ల‌సిన ప‌దార్ధాలు ఏంటో తెలుసుకుందాం…

కావ‌ల‌సిన ప‌దార్ధాలు: 1) మామిడికాయ 2) పుదీనా ఆకులు 3) ఉప్పు 4) వాట‌ర్ 5) పంచ‌దార 6) కార్న్ ఫ్లోర్ 7) నిమ్మ‌కాయ 8) మ్యాంగో ఎసెన్స్ 9) గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్ 10) చాట్ మ‌సాలా త‌యారీ విధానం: ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయ ముక్క‌ను తీసుకొని దాని పై తొక్క‌ను తీసేసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్  చేసుకోవాలి. ఈ ముక్క‌ల‌న్నింటిని మిక్సీజార్ లోకి వేసుకోవాలి. త‌రువాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులు, అర టీ స్ఫూన్ బ్లాక్ సాల్ట్ లేదా నార్మ‌ల్ సాల్ట్ ను వేసుకొని అందులోకి రెండున్న‌ర క‌ప్పుల వాట‌ర్ ను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి. దానికోసం అడుగున ఒక బౌల్ పెట్టి, పైన ఒక జ‌ల్లెడ‌ను ఉంచి పైన ప‌లుచ‌టి క్లాత్ ను వేసి జ్యూస్ మొత్తాన్ని అందులోకి పోసుకొని బాగా పిండుకోవాలి.

Summer Special Kaccha Mango Popsicle Ice Cream

Summer Special Kaccha Mango Popsicle Ice Cream

ఇలా పిండిన త‌రువాత క్లాత్ లో ఉన్న పిప్పి మొత్తాన్ని ప‌డ‌వేయండి. ఇప్పుడు స్ట‌వ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ముప్పావు క‌ప్పు దాకా పంచ‌దార‌ను వేసుకోవాలి. త‌రువాత అందులోకి వ‌న్ టేబుల్ స్ఫూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని, ఇందులోనే మ‌నం తీసిపెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ను వేసుకొని బాగా క‌లుపుకోవాలి. గ్యాస్ ను త‌క్కువ లేదా మీడియం సైజులో పెట్టుకొని పంచ‌దార మొత్తం క‌రిగిపోయేలాగా బాగా క‌లుపుకోవాలి. పంచ‌దార క‌రుగుతున్న‌ప్పుడే ఒక బ‌ద్ద నిమ్మ చెక్క‌ను పిండుకొని బాగా క‌లుపుకోవాలి.ఇలా రెండు నిమిషాలు మాత్ర‌మే గ్యాస్ పై పెట్టి వెంట‌నే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులోకి మ్యాంగో ఎసెన్స్ కాని వెనీలా ఎసెన్స్ కాని వేసుకోవాలి.

త‌రువాత అందులోకి గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్ ను రెండు, మూడు చుక్క‌ల దాకా వేసుకొని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని బాగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ మ్యాంగో జ్యూస్ ను ఐస్ మౌల్డ్స్ లోకి వేసుకొవాలి. త‌రువాత అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ ను వేసుకోవాలి. ఒక‌వేళ జ్యూస్ క‌నుక మిగిలితే అందులో కొద్దిగా చాట్ మ‌సాలా వేసుకొని బాగా క‌లుపుకొని ఐస్ మౌల్డ్స్ లోకి ఈ జ్యూస్ ను కూడా పోసుకొని స్టిక్స్ పెట్టుకోవాలి. ఈ మౌల్డ్స్ అన్నింటిని 8,10 గంట‌ల దాకా డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. త‌రువాత బ‌య‌ట‌కు తీస్తే క‌చ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది