Home » Karimnagar » Tbjp Protest Against Ktr At Sircilla
karimnagar

KTR : కేటీఆర్ ఫోటోకు బొట్టు పెట్టి గాజులేశారు.. సిరిసిల్లలో షాకింగ్ ఘటన?

Authored By
Varun G
The Telugu News | Published on: July 16, 2021, 11:07 pm
Advertisement

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని ఇల్లంతకుంటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్ర KTR పై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన బీజేపీ నాయకులు.. ఆయన చిత్రపటాన్ని విచిత్రంగా రూపుదిద్దారు. మంత్రి కేటీఆర్.. ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు.

Advertisement

tbjp protest against ktr at sircilla

ఆ హామీని ఇఫ్పటి వరకు నెరవేర్చలేదని.. హామీ ఇచ్చి కూడా 3 ఏళ్లు దాటిపోయిందని స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. కేటీఆర్ చిత్రపటాన్ని తీసుకొని.. దానికి 38 గాజులను తగిలించారు. ఆ తర్వాత కేటీఆర్ ముఖానికి బొట్టు పెట్టి.. చేతులకు గాజులను తగిలించి.. నినాదాలు చేశారు.

Advertisement

ఇకనైనా మంత్రి కేటీఆర్.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. వెంటనే ఇల్లంతకుంటలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లంతకుంటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. దాన్ని బాగు చేసి.. 30 పడకల ఆసుపత్రిని చేస్తే.. మండల ప్రజలు చికిత్స కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. అందుకే.. అక్కడి స్థానిక బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి