Chandrababu : పప్పులో కాలేసిన 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ చంద్రబాబు.. ఇంజినీరింగ్ లో బైపీసీ ఉంటుందట

Advertisement

Chandrababu : 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. అసలు దేశంలోనే రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిని నేను. నాకంటే సీనియర్ ఎవరూ లేరు. ప్రధాని మోదీ కూడా నాకన్నా జూనియరే రాజకీయాల్లో అంటూ గప్పాలు కొట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు మరి చదువులో అంత అనుభవం లేదా? అనిపిస్తోంది. ఎందుకంటే.. బీకాం ఫిజిక్స్ అనే మాట తెలుసు కదా. జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆయన కూడా టీడీపీ నాయకుడే. ఇప్పటికీ ఆ వీడియో ట్రెండింగ్ లో ఉంటుంది.

Advertisement

తాజాగా చంద్రబాబు కూడా తనకు చదువులపై అంతగా పట్టు లేదని చెప్పకనే చెప్పారు. అసలు హైదరాబాద్ ను డెవలప్ చేసిందే నేను. ఐటీ అంటే నావల్లే వచ్చింది అంటూ టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబుకు అసలు చదువుపై ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఏపీ ఎన్నికల కోసం బిజీ బిజీ అవుతున్నారు. ఆయన ఏమైనా అంటే విజన్ అంటారు. విజన్ 2020 అయిపోయింది ఇక.. ఆయన విజన్ 2048 గురించి మాట్లాడుతున్నారు.

Advertisement
tdp chandrababu comment on engineering in bipc
tdp chandrababu comment on engineering in bipc

Chandrababu : ఇంజనీర్ కావాలంటే బైపీసీ ఎక్కడ చేయాలి అంటూ నోరు జారిన చంద్రబాబు

టీడీపీ యువనేత అప్పుడప్పుడు నోరు జారడం మనం చూస్తుంటాం. సర్లే ఆయన అంటే పిల్లాడు.. తెలుగు సరిగ్గా రాదు. ఎక్కడో చదువుకున్నాడు అని కొట్టిపారేస్తాం. కానీ.. చంద్రబాబుకు ఏమైంది. చక్కగా చదువుకున్నాడు. కానీ.. కనీసం చదువులపై కూడా నాలెడ్జ్ లేదా? ఎక్కడో మాట్లాడుతూ ఇంటర్ లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలంటూ చంద్రబాబు నోరు జారారు. ఇక ఆ వీడియోను పట్టుకొని జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదివరకు జలీల్ ఖాన్ వీడియోను, ప్రస్తుతం చంద్రబాబు వీడియో ఈ రెండింటిని పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంటర్ లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలంటూ చంద్రబాబు నోరు జారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Advertisement
Advertisement