
TDP
గల్లా జయదేవ్.. టీడీపీ పార్లమెంట్ సభ్యుడిగా, గల్లా అరుణ కుమారి వారసుడిగా అందరికీ సుపరిచితమే.. ఇప్పుడు గల్లా జయదేవ్ కు స్థానచలనం తప్పేలా లేదన్నదే హాట్ టాపిక్ గా మారింది. గల్లా జయదేవ్ రెండుసార్లు వరుసగా గెలిచినా, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. అయితే ఆయన గెలుపుకు మాత్రం ఎటువంటి ఢోకా లేదని టాక్. దీంతో ఓవైపు పారిశ్రామికవేత్తగా, మరోవైపు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కు .. వచ్చే ఎన్నికల్లో సీటు కన్ఫర్మ్ అయినా, స్థాన చలనం తప్పడం లేదని తెలుస్తోంది.
అమరావతి ఉద్యమంలోనూ గల్లా జయదేవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్న విషయాన్ని గమనంలో ఉంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గల్లా జయదేవ్ ను ప్లేస్ మార్చి, పోటీకి దించాలని భావిస్తున్నారన్న వార్త ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో గల్లా జయదేవ్ ను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి షిఫ్ట్ చేసి, మరీ బరిలోకి దింపనున్నారని కేడర్ చర్చించుకుంటోంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని, కొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
tdp
ఈ దఫా ఎన్నికల్లో నిలబెట్టే పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయనున్నారు. ఎంపీలుగా సరైన అభ్యర్థుల్ని రంగంలోకి దించితే, అసెంబ్లీ సీట్లు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకే ఎంపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తొందరపడి, నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై స్థానికంగా అసంతృప్తి వెల్లువెత్తుతున్నా, గెలిచే సత్తా ఉన్న నేత అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి తరలించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
అయితే గల్లా జయదేవ్ .. వాస్తవానికి చిత్తూరుకు చెందిన రాజకీయ వారసుడు. కానీ గుంటూరు నుంచి బరిలోకి దింపి, చంద్రబాబు గెలిపించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న రాయపాటి కుటుంబాన్ని కాదని .. చంద్రబాబు గల్లా జయదేవ్ ను పోటీ చేయించారు. 2014, 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్ విజయం సాధించారు. అయితే గల్లా జయదేవ్ పై పార్టీలోనే అసంతృప్తి ఉంది. పనితీరు సరిగా లేదని, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండరని ఫిర్యాదులు ఉన్నాయి.
galla jayadev
గల్లా జయదేవ్ దృష్టి ఎక్కువగా వ్యాపారాలపై ఉందని, అమరావతి ఉద్యమం విషయంలోనూ సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి పోటీ చేయిస్తే, కష్టమేనన్నటాక్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. మరోవైపు బెజవాడ ఎంపీ కేశినేని నానిపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. దీంతో గల్లా జయదేవ్ ను ఈసారి బెజవాడ పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. కేశినేని నానిని వీలైతే, గుంటూరుకు లేదంటే, పక్కన పెట్టేయాలన్నదే చంద్రబాబు నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై కేశినేని నాని .. వైఖరి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే కేశినేని నాని పట్ల వ్యతిరేకత వెల్లువలా మారుతోంది. గత స్థానిక సమరంలోనే నేతల మధ్య విబేధాలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఇక కేశినేని నానికి చెక్ తప్పదన్న టాక్ అప్పట్లోనే వినిపించింది. ఈ వ్యవహారంపై నోరు మెదపని బాబు.. ఇప్పుడు చెక్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ స్థానం నుంచి కేశినేని నానిని తప్పించి, గల్లా జయదేవ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గల్లా జయదేవ్ విజయవాడ పార్లమెంటుకు ఈసారి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.