Family Politics: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ఇంట్లో ఏ చిన్న పరిణామం చోటుచేసుకున్నా దాని వెనుక ఏదో రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఆ ఇంట్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు వాటిపై జరుగుతున్న ప్రచారమే అందుకు ఉదాహరణ. తాజాగా జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది.
ఇతర ధనవంతుల కుటుంబాల్లోలా కాకుండా జగన్ కుటుంబంలో సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెండుగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో అవి సన్నగిల్లుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఒకప్పుడు అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపంగా ఉండేవారు ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అన్న వదిలిన బాణంగా చెప్పుకునే షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.
అంతేకాదు నేరుగా తన సోదరుడు జగన్ పైనే విమర్శలు చేశారు. తండ్రి వైఎస్ జయంతి నాడు జగన్-షర్మిల ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడలేదు. పోనీ ఇద్దరి మధ్య విబేధాలు ఎలా ఉన్నా కచ్చితంగా రాఖీ పండుగ రోజైనా కలుస్తారని వైఎస్ఆర్ అభిమానులు ఆశించారు. కానీ ఆ రోజు కూడా షర్మిల జగన్‌కు నేరుగా రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా రాఖీపండుగ శుభాకాంక్షలు చెప్పారు.
దాంతో అన్నా చెల్లెళ్ల మధ్య విబేధాలున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనని రుజువయ్యింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయమ్మ.. తన భర్త రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజైన సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి నాడు తన భర్త క్యాబెనెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని, ఆయనతో కలిసి నడిచిన వారిని ఆహ్వానించారు.
అయితే, పార్టీలకు అతీతంగా తాను ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ చెబుతున్నారట. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణకు చెందిన డి శ్రీనివాస్‌తోపాటు పలువురికి ఆహ్వానాలు చేరాయి. అయితే, వైఎస్ మరణించి 12 సంవత్సరాలు పూర్తయినా విజయమ్మ ఏ వర్థంతికి కూడా ఆయనతో కలిసి పనిచేసిన నేతలను ఆహ్వానించలేదు. కానీ, తొలిసారిగా ఇప్పుడు ఆమె వైఎస్‌తో కలిసి పనిచేసిన నేతలకు ఆహ్వానాలు పంపడం ఊహాగానాలకు తెరతీసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.