Home » Andhra Pradesh » Tdp Leaders Face News On Amma Vodi
andhra pradesh

Amma Vodi : అమ్మ ఒడి పథకంపై మరీ ఇంత అక్కస్సు ఏంట్రా బాబు మీకు?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 31, 2022, 8:20 am
Advertisement

Amma Vodi : వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం ఎంతో మంది విద్యార్థిని విద్యార్థల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తుంది. అద్బుతమైన ఈ పథకంపై తెలుగు దేశం పార్టీ నాయకులు మొదటి నుండి అక్కస్సుతో ఉన్నారు. అమ్మ ఒడి పథకంతో ఎంతో మంది కుటుంబాల్లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక అన్నగా.. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పాటు పడే మేనమామగా నిలిచాడు. దాంతో వచ్చే ఎన్నికల్లో అద్బుతమైన విజయం ఆయనకు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

రాజకీయంగా వైకాపా ను అడ్డు కోవడం చేతకని తెలుగు దేశం పార్టీ నాయకులు ఇప్పుడు వైకాపా ను దెబ్బ కొట్టేందుకు దొంగ దారులు వాడుతున్నారు అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమ్మ ఒడి పథకం కు అందాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పోతుంది. ఈ ఏడాది నుండి అమ్మ ఒడి ని కొనసాగించలేం అంటూ వారు తేల్చి చెప్పారు అంటూ ఒక ప్రెస్ నోట్‌ ను ప్రభుత్వం పేరుతో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.ఆ ప్రెస్ నోట్‌ ను కొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెగ ప్రచారం చేశాయి. మీడియా వారికి తెలిసినా కూడా అమ్మ ఒడి పథకం విషయంలో ఆ పుకార్లను ఎక్కువ చేసే ప్రయత్నం చేశారు.

tdp leaders face news on amma vodi

Advertisement

అమ్మ ఒడి పథకంకు నిధులు లేవు అంటూ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో చీప్ పబ్లిసిటీ మరియు ప్రచారం చేస్తూ వైకాపా ను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని అసలు విషయం ఏంటీ అంటే ప్రజలు అమ్మ ఒడి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను సక్రమంగా అద్బుతంగా అందుకుని వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేస్తారంటూ వైకాపా ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి