Intinti Gruhalakshmi 31 May Today Episode : తులసి తెచ్చిన చీరనే కట్టుకున్న అంకిత.. దీంతో గాయత్రి, లాస్య, నందు షాకింగ్ నిర్ణయం.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 31 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 646 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి 10 కావస్తున్నా.. పరందామయ్య ఏదో ఆలోచిస్తూ దీనంగా కూర్చొని ఉంటాడు. మామయ్య గారు ఏంటి.. ఇంత సేపు మేల్కొని ఉన్నాడు అని అనుకొని ఒక గరిటె తీసుకెళ్లి.. తనను హిప్నటైజ్ చేస్తుంది తులసి. దీంతో పరందామయ్య కళ్లు మూసుకొని నిద్రపోతాడు. మీకు నా మాటలు వినపడటం లేదు. నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నారు అని అంటుంది. దీంతో పరందామయ్య కూర్చొని నిద్రపోతాడు. అయిపోయిందా ఇక కళ్లు తెరవచ్చా అంటాడు. చూడమ్మా తులసి.. ఇంకా నటించడం నావల్ల కాదమ్మా అంటాడు. నీ హిప్నాటిజం నామీద పనిచేయదు అంటాడు.

intinti gruhalakshmi 31 may 2022 full episode

అర్ధరాత్రి అవుతున్నా మీరు ఎందుకు నిద్రపోకుండా ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. దీంతో నా కొడుకును ఎందుకు కన్నానా అని బాధపడుతున్నాను అంటాడు. వాడి కోడలుకు బర్త్ డే పార్టీ చేస్తున్నాడు సరే.. ఆమె నీ కోడలు అని కూడా తెలుసుకోలేకపోయాడు అంటుంది. మీరు ఎందుకు ఆ విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. కట్ చేస్తే తులసి టైమ్ చూస్తుంది 12 అవుతుంది. అంకితకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతా అని అనుకొని ఫోన్ తీస్తుంది తులసి.

కానీ.. మళ్లీ ఎందుకో ఫోన్ చేయొద్దు అనుకుంటుంది. బలవంతంగా ఇంట్లో నుంచి పంపించాను. నా మీద కోపంగా ఉండి ఉండొచ్చు. నాతో మాట్లాడుతుందో లేదో అని అనుకుంటుంది. మరోవైపు అంకిత.. తులసి ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది.

ఇంతలో ఫోన్ చేసి బంగారు తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అంటుంది. మీరు ఫోన్ చేస్తారో చేయరో అని అనుకున్నా ఆంటి.. అంటుంది. నాకు దూరంగా ఉంటున్నా.. నా మనసుకు దగ్గరగా ఉన్నావు నువ్వు అంటుంది తులసి. ఏ అత్త అయినా నీ లాంటి కోడలినే కోరుకుంటుంది అంకిత అంటుంది తులసి.

ఇంతలో దివ్య వస్తుంది. అంకితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది. ఆ తర్వాత మీరు రేపు పార్టీకి వస్తున్నారు కదా అని అడుగుతుంది అంకిత. దీంతో మేము రావట్లేదు అంటుంది తులసి. దీంతో మీరు రాకపోతే పార్టీనే జరగదు. నేను కేక్ కట్ చేయను అంటుంది.

Intinti Gruhalakshmi 31 May Today Episode : అంకిత బర్త్ డే పార్టీకి ఓకే చెప్పిన తులసి

దీంతో ఏం చేయాలో తెలియదు తులసికి. సరే.. వస్తాను అంటుంది తులసి. దీంతో అంకిత ఖుషీ అవుతుంది. థాంక్యూ ఆంటి బై.. గుడ్ నైట్ అని చెబుతుంది. నా బర్త్ డే బేబీకి స్పెషల్ గిఫ్ట్ అంటూ బంగారు నెక్లెస్ ను తీసుకొచ్చి ఇస్తాడు అభి. కానీ.. అంకిత మాత్రం పెద్దగా ఆ గిఫ్ట్ ను చూసి సర్ ప్రైజ్ కాదు.

దాన్ని తన మెడలో వేయబోతుండగా వద్దు అంటుంది అంకిత. నా కండిషన్ నీకు తెలుసు. ఏదైనా సరే.. నీ డబ్బులతో కొన్నదే గిఫ్ట్ గా ఇవ్వు. అది గులాబీ పువ్వు అయినా సరే సంతోషంగా తీసుకుంటాను అంటుంది. దీంతో ఇది నా డబ్బులతో కొన్నదే అంటాడు అభి.

నువ్వు ఇచ్చిన నెక్లెస్ కన్నా.. నువ్వు నామాటకిచ్చిన గౌరవం నచ్చింది. ఎప్పుడూ ఇలాగే ఉండు అభి అంటుంది అంకిత. నీ చేత్తోనే దాన్ని నా మెడలో వేయి అంటుంది అంకిత. మరోవైపు అంకిత.. శృతికి ఫోన్ చేసి మరిచిపోయారు నన్ను అంటుంది.

బర్త్ డే పార్టీకి రావాలని ప్రేమ్, శృతికి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు అంకిత పుట్టిన రోజు సందర్భంగా అంకితకు ఇవ్వడానికి డిజైనర్ చీరను కుడుతూ ఉంటుంది తులసి. మనం పార్టీకి వెళ్లడం లేదు కదా అంటాడు పరందామయ్య. దీంతో అంకిత ఫోన్ చేసి రమ్మన్నది.

రాకపోతే పుట్టిన రోజునే జరుపుకోనని మొండికేస్తోంది అంటుంది తులసి. దీంతో అందరం వెళ్దాం అంటుంది తులసి. మరోవైపు నందు, లాస్య కూడా అంకిత పార్టీ కోసం రెడీ అవుతారు. అంకిత బర్త్ డే కోసం నేను ఒక చీర కొన్నానని చెబుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

32 minutes ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

2 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

3 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

4 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

5 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

6 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

7 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

8 hours ago