Chandrababu : మొత్తం కథ రివర్స్ అయ్యింది.. తెలుగు తమ్ముళ్ళ అట్టర్ ఫ్లాప్ రాజకీయం !
Chandrababu : ఈసారి 175 సీట్లకు 175 సీట్లు ఖచ్చితంగా గెలవాలి అని వైసీపీ పార్టీ భావిస్తోంది. ఇదివరకు 150 వరకే సీట్లు గెలిచింది వైసీపీ. మిగిలిన సీట్లు మాత్రం ఎందుకు ఓడిపోవాలి. ఒక్క సీటును కూడా వేరే పార్టీలకు వదిలేయొద్దు. అన్నీ సీట్లు మనవే అంటూ సీఎం జగన్ కూడా చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి అందరు ఎమ్మెల్యేల పని తీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. వాళ్లకు ఒక రేటింగ్ కూడా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎలా పాల్గొంటున్నారు.. వాళ్లు ప్రజలతో మమేకం అవుతున్నారా లేదా అనేదానిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైఎస్ జగన్ రూట్ లోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే.. ఆయన సొంతంగా టీడీపీ ఆశావహులు, ఎమ్మెల్యేల పనితీరుపై, ప్రజల్లో ఉండే క్రేజ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారట.
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు కూడా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష
సర్వే కూడా చేస్తున్నారట. వాళ్లకు ఒక రేటింగ్ ఇస్తున్నారట. ఆ రేటింగ్ లో గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు టాప్ లో ఉన్నారట. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు రేటింగ్ లో వెనుకబడినట్టు తెలుస్తోంది. అందుకే.. ఉత్తరాంధ్రలో ఒక మీటింగ్ పెట్టి ఉత్తరాంధ్ర నేతలకు క్లాస్ పీకనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు హోప్స్ పెట్టుకున్నదే ఉత్తరాంధ్ర మీద, అక్కడి నేతల మీద. అలాంటిది.. ఆయన సర్వేలో వాళ్లే అంతగా చురుకుగా లేకపోవడంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదట. చూద్దాం మరి భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?