TDP : మళ్లీ బీజేపీతో పొత్తుకు టీడీపీ సై.. నై అంటున్న కమలనాథులు?

Authored By mallesh | The Telugu News | Published on: November 5, 2021, 8:15 am

TDP : 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ, 2019 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ, జనసేనలతో పొత్తులో లేకుండా ఒంటరిగానే బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అలా ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీడీపీ ప్రస్తుతం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ వేసుకుని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.

TDP

TDP

అయితే, బీజేపీలోని ఓ వర్గం మాత్రం టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం లేదని,అందుకే ఇటీవల ఢిల్లీలో బీజేపీ ఏపీ వ్యవహారాలు చేసుకునే ఇన్‌చార్జి, సీనియర్ నేత సునీల్ దేవధర్ మీడియా సమావేశం పెట్టి మరి టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో టీడీపీ బీజేపీ పొత్తు గురించి ఆసక్తి కర చర్చ జరుగుతున్నది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ టీడీపీ అప్పుడే పొత్తుల గురించి ఆలోచన చేస్తుందా? అని అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో ఉండి కొన్ని స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు మళ్లీ ఆనాటి పొత్తు కాంబినేషన్ అనగా టీడీపీ-బీజేపీ-జనసేన తెరమీదకు వస్తుందేమోననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

TDP : కమలంతో పొత్తు ఉండాలని ప్లాన్..!

BJP

BJP

కాగా, బీజేపీని పొత్తుకు ఒప్పిస్తే జనసేన ఆటోమేటిక్‌గా పొత్తులో భాగస్వామి అవుతుందనే వాదన కూడా వినబడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి నిమిషం వరకు పొత్తుకు ప్రయత్నిస్తారని పలువురు అనుకుంటున్నారు.అయితే, చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే, రాష్ట్రనాయకత్వం సలహా, సంప్రదింపులు లేకుండానే బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు భవిష్యత్తులో సై ..అంటుందా చూడాలి మరి..

mallesh

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp