
TDP
TDP : ఆంధ్రప్రదేశ్‌లో తామే అధికారంలోకి వస్తామంటోంది తెలుగుదేశం పార్టీ, 2024 ఎన్నికలపై టీడీపీ చాలా ఆశలే పెట్టుకుందిగానీ, ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి 2024 ఎన్నికల్లో వుండకపోవచ్చు. వాస్తవానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న కొందరు నేతలు, చివరి నిమిషంలో వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయంటూ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
అయితే, వైసీపీ మాత్రం తాము 175 సీట్లలోనూ గెలిచి తీరతామంటోంది. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ధీమాగా చెబుతున్నారు. ఇంతకీ, 2019 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? ప్రస్తుతం వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణల ప్రకారం చూస్తే, టీడీపీ 2024 ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించే అవకాశం లేదట. సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితమవుతుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
TDP To Get Single Digit This Time
ఈ విషయమై టీడీపీ వర్గాల్లోనూ ఒకింత గుబులు రేగుతున్నా, పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. కింది స్థాయిలో పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు టీడీపీలో వున్నారా.? అధినేత దగ్గర్నుంచి, అందరికీ అన్ని విషయాలపైనా అవగాహన వుంది. ఇక్కడ చిత్రమేంటంటే, టీడీపీ కంటే జనసేన పార్టీకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం వుండడం. కాస్త కష్టపడితే, టీడీపీ నీడ పడకుండా చూసుకోగలిగితే, జనసేన డబుల్ డిజిట్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.