Uttar Pradesh : గురువులే ఇలా చేస్తే ఎలా.. 8వ తరగతి స్టూడెంట్ కు లవ్ లెటర్ రాసిన టీచర్.. చివరికి ఏం జరిగిందంటే..?
Uttar Pradesh : ప్రస్తుత రోజులలో ఘోరాతి ఘోరమైన సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మనిషి మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. ఐదు నిమిషాల సుఖం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నాడు. కుటుంబంలో …బయట అన్నిచోట్ల కూడా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ఆడపిల్లలకు అస్సలా భద్రత లేదు. ఆడపిల్ల ఇంటి నుండి బయట అడుగుపెడుతుందంటే.. మల్లి తిరిగి ఎలా వస్తుందో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొత్త సంవత్సరం న్యూ ఇయర్ రోజు దేశ రాజధాని ఢిల్లీలో.. యువతీ దారుణంగా మరణించడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే యుపిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.
చదువు చెప్పాల్సిన గురువులు సైతం.. పిల్లలపై కామ కోరికలు తీర్చుకుంటున్నారు. ఏకంగా ఓ ప్రబుద్ధుడు 8వ తరగతి చదువుతున్న బాలికకు ప్రేమ లేఖ రాయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ లో కన్నౌజ్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అదే పాఠశాలకు చెందిన 8వ తరగతి బాలికపై సదరు ఉపాధ్యాయుడు కన్ను వేయడం జరిగింది. అదేపనిగా ఆ బాలిక వైపు చూడటంతో పాటు అనవసరంగా మాట్లాడటంతో పాటు.. సపరేటుగా తన ఆఫీసు రూమ్ కి పిలిపించుకోవడం వంటివి చేసేవాడు. ఈ క్రమంలో ఓ రోజు సదరు బాలికకి ప్రేమలేఖ ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని లెటర్ రాయడం జరిగింది.
teacher wrote a love letter to a 8th grade student in uttar pradesh
సెలవులలో నిన్ను చాలా మిస్ అయ్యాను. స్కూల్ కి తొందరగారా. మన ఇద్దరం పక్కపక్కనే కూర్చునే ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటూ సదరు ఉపాధ్యాయుడు లవ్ లెటర్ రాయడం జరిగింది. దీంతో ఆ బాలిక ఉపాధ్యాయుడు రాసిన లవ్ లెటర్ ని తల్లిదండ్రులకు చూపించింది. ఈ పరిణామంతో కోపంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో కీచక టీచర్ దారుణ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురువులే ఇలా చేస్తే ఎలా… అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
