
Contract and Outsourcing Employees : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్
Contract and Outsourcing Employees : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులలో దీర్ఘకాలంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను నిలిపివేస్తూ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 776 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను ప్రభుత్వం ఇటీవల మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా భర్తీ చేసింది.
Contract and Outsourcing Employees : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్
కొత్తగా ఎన్నికైన రెగ్యులర్ ఉద్యోగులకు నియామక పత్రాలు
ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయి.. కొత్తగా ఎన్నికైన రెగ్యులర్ ఉద్యోగులకు నియామక పత్రాలు కూడా అందజేశారు. నిబంధనల ప్రకారం.. ఒక పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి నియమితులైనప్పుడు.. ఆ స్థానంలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ సిబ్బందిని విధుల నుంచి తక్షణమే తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు
ఈ నిర్ణయంపై డీఎంఈ కార్యాలయం శుక్రవారం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఒక సర్క్యులర్ పంపింది. కొత్తగా చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి.. ఆ స్థానాల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై తీసుకున్న చర్యలను వివరిస్తూ తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
వాస్తవానికి.. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలానికి వివిధ విభాగాల్లో మొత్తం 16,448 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ కేటగిరీ కింద పని చేసేవారు కూడా ఉన్నారు. తాజాగా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేేసే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులు ఇక నుంచి పని చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. దీంతో వారి సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post Office Franchise 2026: రూ. 5,000 పెట్టుబడితో నెలకు వేలల్లో ఆదాయం! సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వేతన జీవులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పిఎఫ్ ఖాతాల్లో…
No Cost EMI : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మనకు తరచుగా వినిపించే ఆకర్షణీయమైన పదం 'నో కాస్ట్ ఇఎంఐ'…
Ex Lover : భర్త మహాశయులకు విజ్ఞప్తి..రోజు రోజుకు అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో భర్తలు హతం అవుతున్నారు.…
Today Gold Rate : ఒకప్పుడు బంగారం ధరలు మాత్రమే పరుగులు పెట్టేది..కానీ ఇప్పుడు చైనా పుణ్యమా అని వెండి…
This website uses cookies.