YS Avinash Reddy : వివేకా కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డి విచారణ పై హైకోర్టు కీలక ఆదేశం
YS Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీని ప్రధాన నిందితుడిగా చేసి సీబీఐ ఆయన్ను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీనిపై అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పై ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ ను విచారించిన కోర్టు..
అవినాస్ రెడ్డిని సాయంత్రం 5 వరకు విచారించడానికి వీలు లేదని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయంత్రం 5 తర్వాతనే అవినాష్ రెడ్డిని విచారిస్తామని కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. నిజానికి ఇవాళ మధ్యాహ్నమే వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ.. ఆయన అప్పటికే ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై విచారణ జరిపిన కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
YS Avinash Reddy : వివేకా హత్యతో నాకు సంబంధం లేదు
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి.. వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు, వివేకా కూతురు సునీతతో సీబీఐ అధికారులు కుమ్మక్కు అయి తనకు నోటీసులు ఇచ్చి ఈకేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్ లో స్పష్టం చేశారు. గూగుల్ టేకౌట్ ద్వారా తనను నిందితుడిగా ఎలా చేర్చుతారు అంటూ ప్రశ్నించారు. తనకు న్యాయంపై నమ్మకం ఉందని, వెంటనే ముందస్తు బెయిల్ ఇవ్వలని కోర్టుకు అవినాష్ విన్నవించారు.