Kavitha : బీఆర్‌ఎస్ ఓట్లకు గండి కోట్టనున్న కవిత..!
ప్రధానాంశాలు:
Kavitha : బీఆర్‌ఎస్ ఓట్లకు గండి కోట్టనున్న కవిత..!
Kavitha : తెలంగాణ Telangana Politics రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికలు Municipal elections సమీపిస్తున్న వేళ, బీఆర్ఎస్ BRSఅధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత Kavithaకీలక రాజకీయ నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత గత కొద్ది రోజులుగా మద్దతుదారులు, అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే దిశగా ఆమె సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Kavitha : బీఆర్‌ఎస్ ఓట్లకు గండి కోట్టనున్న కవిత..!
Kavitha: తెలంగాణ జాగృతి..సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి
మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ తెలంగాణ జాగృతి సంస్థ ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. పార్టీ గుర్తు Party symbolవిషయంలో కూడా స్పష్టత వచ్చింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) పార్టీతో సంప్రదింపులు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి నాయకత్వం ఆ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశంపై కవిత పలువురు ప్రముఖులు, రాజకీయ మద్దతుదారులతో చర్చలు జరిపినట్టు సమాచారం. తాజాగా ఏఐఎఫ్‌బీ తెలంగాణ జాగృతి మధ్య పోటీపై గుర్తుపై సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ జాగృతిTelangana Jagrutiని రాజకీయ పార్టీగా నమోదు చేసే ప్రక్రియకు కవిత వేగం పెంచారు. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈలోపు జరిగే ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు.
Kavitha: బీఆర్ఎస్ ఓట్లకు నష్టం?.. ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలు ప్రకటించగా అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రతి జిల్లాకు మంత్రులకు బాధ్యతలు అప్పగించగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో కవిత ఎన్నికల బరిలోకి దిగడం వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌కు గండి పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే కవిత ప్రభావం ఏ వర్గం ఓటర్లపై ఉంటుందో ప్రజలు ఎంతవరకు ఆమెకు మద్దతుగా నిలుస్తారో ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.