Telugu Actress Ravali Spotted In Tirumala After A Long Time
Actress Ravali : సీనియర్ నటి రవళిని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే.. కానీ అప్పట్లో రవళికి బాగానే ఫ్యాన్స్ ఉండేవారు. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలయ్య బాబు, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి టాప్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆలీబాబా అరడజను దొంగలు, రియల్ హీరో, ఒరేయ్ రిక్షా, వినోదం, పెళ్లి సందడి, శుభాకాంక్షలు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక చివరగా ఆమె మాయగాడు అనే సినిమాలో నటించింది.
కాగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రవళి మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలో ఓ పాత్రలో మెరిసింది. ఇక శ్రీకాంత్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన సినిమా పెళ్లిసందడి. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవళి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా.. పెళ్లిసందD మూవీ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అప్పటి పెళ్లి సందడి నటీనటులను కూడా ఇన్వైట్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నటి రవళి తనను ఎవరూ గుర్తుపట్టడం లేదని చెప్పారు.
Telugu Actress Ravali Spotted In Tirumala After A Long Time
తన పేరు రవళి అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక ఈ ఈవెంట్ కి చిరంజీవి, వెంకటేష్ కూడా హాజరవ్వగా వాళ్లు కూడా రవళిని గుర్తుపట్టలేకపోయారు. కాగా తాజాగా మంత్రి రోజాతో తిరుమల దేవస్థానంలో కనిపించారు. రోజాతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియా ముందు ఫొటోలు దిగారు. అయితే మంత్రి రోజా పక్కన ఉన్నది ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ రవళి అని చాలామంది గుర్తుపట్టలేకపోయారు. మంత్రి రోజాతో కలిసి రవళి ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.