వీడు మాములోడు కాదు.. వీర్యంతో ఏటా 24 కోట్లు సంపాదిస్తున్నాడు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

వీడు మాములోడు కాదు.. వీర్యంతో ఏటా 24 కోట్లు సంపాదిస్తున్నాడు..!

ఒక మామూలు సగటు జీవి నెలకు గట్టిగా కష్టపడితే 25 వేల రూపాయల వరకు సంపాదిస్తాడు. అదే సాఫ్ట్ వేర్ టెకీలయితే మరింత ఎక్కువగా సంపాదిస్తారు. కానీ ఓ వ్యక్తి ఎటువంటి పని చేయకుండా ఏడాదికి రెండు కోట్ల రూపాయలను కూర్చుండే సంపాదిస్తున్నాడు. ఇలా అంత డబ్బు సంపాదిస్తున్నాడంటే అతడికి ఏదైనా బిజినెస్సో, లేక ఏజెన్సీ యో ఉందని అనుకుంటే పొరపాటే. అతడికి అటువంటివి ఏమీ లేవు. అతడికి ఉన్నది కేవలం దున్నపోతు మాత్రమే. ఏడాదికి అన్ని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 November 2021,8:00 pm

ఒక మామూలు సగటు జీవి నెలకు గట్టిగా కష్టపడితే 25 వేల రూపాయల వరకు సంపాదిస్తాడు. అదే సాఫ్ట్ వేర్ టెకీలయితే మరింత ఎక్కువగా సంపాదిస్తారు. కానీ ఓ వ్యక్తి ఎటువంటి పని చేయకుండా ఏడాదికి రెండు కోట్ల రూపాయలను కూర్చుండే సంపాదిస్తున్నాడు. ఇలా అంత డబ్బు సంపాదిస్తున్నాడంటే అతడికి ఏదైనా బిజినెస్సో, లేక ఏజెన్సీ యో ఉందని అనుకుంటే పొరపాటే. అతడికి అటువంటివి ఏమీ లేవు. అతడికి ఉన్నది కేవలం దున్నపోతు మాత్రమే.

ఏడాదికి అన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి..

అవును. మీరు విన్నది కరెక్టే. అతడు దున్నపోతు మీద ఏడాదికి రెండు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. అతడు అంతలా డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఆ దున్నపోతును ఏదో పందెంలో ఉంచాడనుకుంటే పొరపాటే. అతడు ఆ దున్నపోతు వీర్యం మీదే అంత డబ్బులు సంపాదిస్తున్నాడు. అర్వింద్ జంగిడ్ అనే వ్యక్తికి చెందిన భీమ్ అనే దున్నపోతు కథ ఇది. ఈ దున్నపోతు ధర తెలిస్తే మీరు షాక్ కు గురికాక మానరు. ఈ దున్నపోతు ధర ఏకంగా 24 కోట్ల రూపాయలు. ఈ దున్నపోతు నెలవారీ ఖర్చుల విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

that person gettinig crores of money with a buffalo

that person gettinig crores of money with a buffalo

ఈ దున్నపోతును పోషించేందుకు నెలకు రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నాడు. ఇంత ఖర్చు ఎందుకోసమంటే ఆ దున్నపోతు రోజుకు ఏకంగా 25 లీ. పాలు, అరకేజీ వెన్న, కేజీ నెయ్యి, 200 గ్రా. తేనే, కిలో జీడిపప్పు తన ఆహారంగా తీసుకుంటుంది. అందుకోసమే ఈ దున్నపోతు నెల వారీ ఖర్చులు రెండు లక్షల రూపాయలను తాకాయి. ఈ దున్నపోతు వీర్యం ద్వారా పుట్టిన గేదెలు పెద్దయ్యాక 25 నుంచి 30 లీ. వరకు పాలిస్తాయట. ఈ విషయాన్ని ఆ దున్నపోతు యజమాని అయిన అర్వింద్ జంగిడే స్వయంగా తెలిపాడు. ఏడాదికి రెండు కోట్లు సంపాదిస్తుందంటే, ఆ దున్నపోతు చాలా గ్రేట్ కదా.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది