
Bhatti Vikramarka:తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు సహజ వనరులను కాపాడటం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాలను విస్తరించుకోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల ఆస్తులను గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి రక్షించడమే తన ప్రధాన బాధ్యత అని అన్నారు. సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని వాటి పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్‌లకు టెండర్లు పిలవడంపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. అవి కట్టుకథలు, పిట్టకథలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని అందులో మంత్రుల జోక్యం లేదని స్పష్టం చేశారు. టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థే తప్ప మంత్రి కాదని గుర్తుచేశారు. క్లిష్టమైన ప్రాంతాల్లో గనులు ఉన్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి అని ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ అమలులో ఉన్నాయని వివరించారు.
తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిని కావడమే తనపై కక్ష సాధింపులకు కారణమవుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ఉద్దేశాలతో కథనాలు రాస్తున్నాయని విమర్శించారు. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కావాలనే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలకు భయపడే వ్యక్తిని కాదని నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ కథనంలో తన పేరును అనవసరంగా లాగడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంశాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం సరికాదని హితవు పలికారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేసిన భట్టి విక్రమార్క సింగరేణి ప్రజల ఆస్తి బొగ్గుగనులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని అన్నారు. రాష్ట్ర వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన సంకల్పమని ఈ దిశగా ఎలాంటి ఒత్తిడులకైనా తలవంచేది లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.
Peddi Movie Pre Sales : మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రత్యేక…
Ponnam Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan…
LPG : దేశవ్యాప్తంగా కోట్లాది ఎల్పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. వంటగ్యాస్ సేవలను మరింత…
TGPSC Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని…
OnePlus Nord 2T : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను సరసమైన ధరలో…
Farming Success Story : వ్యవసాయంలో సంప్రదాయ పంటలతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి పెట్టే రైతుల సంఖ్య రోజురోజుకూ…
Peddi Ticket Price Hike : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Healthy Masala Milk : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, యువత, వృద్ధులు పోషకాహారాన్ని…
Banana vs Dates : ఉదయం లేచిన వెంటనే మనం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది.…
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
This website uses cookies.