Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రధానాంశాలు:
Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు సహజ వనరులను కాపాడటం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. ఆస్తుల సంపాదన కోసమో వ్యాపారాలను విస్తరించుకోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల ఆస్తులను గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి రక్షించడమే తన ప్రధాన బాధ్యత అని అన్నారు. సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని వాటి పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణలకు ఖండన
సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్‌లకు టెండర్లు పిలవడంపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. అవి కట్టుకథలు, పిట్టకథలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని అందులో మంత్రుల జోక్యం లేదని స్పష్టం చేశారు. టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థే తప్ప మంత్రి కాదని గుర్తుచేశారు. క్లిష్టమైన ప్రాంతాల్లో గనులు ఉన్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి అని ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ అమలులో ఉన్నాయని వివరించారు.
Bhatti Vikramarka: రాజకీయ ఉద్దేశాలతో వ్యక్తిత్వ హననం
తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిని కావడమే తనపై కక్ష సాధింపులకు కారణమవుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ఉద్దేశాలతో కథనాలు రాస్తున్నాయని విమర్శించారు. ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కావాలనే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలకు భయపడే వ్యక్తిని కాదని నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ కథనంలో తన పేరును అనవసరంగా లాగడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంశాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం సరికాదని హితవు పలికారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేసిన భట్టి విక్రమార్క సింగరేణి ప్రజల ఆస్తి బొగ్గుగనులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని అన్నారు. రాష్ట్ర వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే తన సంకల్పమని ఈ దిశగా ఎలాంటి ఒత్తిడులకైనా తలవంచేది లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.