Viral News : బాలుడిని కాటేసిన వెంట‌నే చ‌నిపోయిన పాము… బాలుడికి మాత్రం ఏం కాలేదు ఎందుకంటే..

Authored By mallesh | The Telugu News | Published on: June 26, 2022, 5:00 pm

Viral News : పాములు ఎంత డేంజ‌రో అందరికీ తెలిసిందే… పాము క‌నిపిస్తేనే భ‌య‌ప‌డిపోతాం. పాముల్లో చాలా ర‌కాలు ఉన్నాయి. అత్యంత విష‌పూరిత‌మైన పాములు ఉంటాయి. ఇవి కాటేస్తే చాలా ప్ర‌మాదం. ఎంతో మంది పాము కాటుతో చ‌నిపోయారు కూడా. అయితే సాధార‌ణ పాములు క‌టువేస్తే అంత‌గా ఎఫెక్ట్ చూపించ‌వ‌ని అంటారు. అయితే ఇక్క‌డ ఒక వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరుబ‌య‌ట ఆడుకుంటున్న చిన్న బాలుడి పాము కాటేసింది.

విచిత్ర‌మేమంటే బాలుడికి ఏం కాలేదు.. కానీ ఆ పాము కాటేసిన త‌ర్వాత చ‌నిపోయింది. ఈ సంఘ‌ట‌న తాజాగా బీహార్ లోని గోపాల్ గంజ్ లో జ‌రిగింది. బరౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మధోపుర్​ గ్రామానికి చెందిన రోహిత్​ కుశ్వాలాకు నాలుగు సంవత్సరాల కొడుకు అనూజ్​ కుమార్​ ఉన్నాడు. అనూజ్​ తన తల్లితో సహా కుచాయ్​కొట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అమ్మమ్మ వాళ్ల‌ ఇంటి వద్ద ఉంటున్నాడు.ఈ క్రమంలో అనూజ్​ ఇంటి ముందు కాలి స్థలంలో ఆడుకుంటూ ఉండగా పాము కాటేసింది.

The snake that died as soon as it bit the boy

The snake that died as soon as it bit the boy

Viral News : బాలుడు ఆడుకుంటుండ‌గా..

ఆ బాలుడు ఏడ‌వ‌డంతో పేరెంట్స్ కంగారుగా ప‌రుగెత్తుకొచ్చారు. అయితే బాలుడిని కరిచిన పాము కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది. వెంట‌నే బాలుడిని హాస్పిట‌ల్ కి తీసుకెళ్ల‌గా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. విషయం తెలుసుకున్న ఆ ఊరి ప్ర‌జ‌లు ఆశ్చర్యపోతూ హాస్పిటల్ త‌ర‌లివెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడటానికి హాస్పిట‌ల్ కి త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp