YSRCP : వైకాపాలో అసమ్మతి పూర్తిగా ప్రతిపక్షాల, ఎల్లో మీడియా సృష్టి
YSRCP : మంత్రి వర్గ విస్తరణ తో మాజీ మంత్రులు మరియు మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఒక వర్గం మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వైకాపా లో అసమ్మతి జెండాను ఎగురవేయలేదు. ఆ రెండు రోజులు కాస్త భావోద్వేగంతో ఉన్నారు తప్ప ఆ తర్వాత అంతా నార్మల్ అయ్యింది.
తెలుగు దేశం పార్టీ నాయకులు పార్టీ లో ఎదో జరుగుతుంది.. పార్టీ లు మారే యోచనలో ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరి లో భావన కలిగించే ప్రయత్నాలు చేశారు. తద్వారా వైకాపా లో అనిశ్చితిని కలిగించేందుకు తెలుగు దేశం పార్టీ మరియు ఒక వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ చేస్తున్న అన్ని ఆరోపణలు కూడా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా లో అసమ్మతి వర్గం అనేది లేదు అంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గతంలోనే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో కొత్త మంత్రులు వస్తారు అంటూ జగన్ అన్నాడు. అన్నట్లుగానే కొందరిని తీసేశారు. వారు మంత్రి పదవులను వదిలేందుకు ముందు నుండే సిద్దంగా ఉన్నారు. కనుక వారిలో ప్రస్తుతం ఎలాంటి అసమ్మతి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా లో ఉన్న అసమ్మతి పూర్తి గా అవాస్తవం అని.. ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చే సారి తమకు అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారని.. మాజీ మంత్రులు కూడా తమకు వచ్చిన అవకాశం పట్ల సంతోషంగా ఉన్నామని అంటున్నారు. కనుక వైకాపాలో అసమ్మతి అనేది లేదు.. కనుక మీడియా అనవసర రాద్దాంతం చేయవద్దు.