
#image_title
TEA | వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే వచ్చే ఆ హాయీకి సాటి లేదు. అయితే టీ తాగడం కేవలం అలవాటు కాదు , అది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిపుణుల చెబుతున్న ప్రకారం, సాధారణ టీ డికాషిన్‌తో కాకుండా సహజ పదార్థాలతో చేసిన హెల్తీ టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.
#image_title
ఇక్కడ అలాంటి మూడు హోమ్‌మేడ్ స్పెషల్ టీలను ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం
పుదీనా టీ (Mint Tea)
పుదీనా ఆకులు అజీర్ణానికి సహజ పరిష్కారం. ఈ ఆకులతో చేసిన టీ నోటి దుర్వాసన, మానసిక అలసట, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తయారీ విధానం:
తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉంచి వడకట్టాలి. కావాలంటే తేనె చేర్చుకోవచ్చు.
ప్రయోజనం: జీర్ణక్రియ మెరుగవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
లవంగం టీ (Clove Tea)
లవంగాలు జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులోని యూజీనాల్ అనే పదార్థం జీర్ణాశయంలో మంటను తగ్గించి, ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది.
తయారీ విధానం:
కొన్ని లవంగాలను ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. రుచి కోసం అల్లం కూడా కలపవచ్చు.
ప్రయోజనం: జీర్ణశక్తి పెరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జీలకర్ర టీ (Cumin Tea)
జీలకర్రలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు సమస్యలను దూరం చేస్తాయి. ఇది అపానవాయువు, అజీర్ణం, గ్యాస్ సమస్యలకు సహజ చికిత్స.
తయారీ విధానం:
ఒక టీస్పూన్ జీలకర్రను నీళ్లలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి వేడిగా తాగాలి.
ప్రయోజనం: కడుపు సమస్యలు తగ్గుతాయి, ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది.
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
Business Idea: తక్కువ పెట్టుబడితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం ఒక ట్రెండీ ఐడియా బాగా పాపులర్ అవుతోంది.…
Free Sewing Machine Scheme 2026: మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి…
Good News : భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారయ్యే…
Gold Rate Today Jan 26th 2026 : నేడు 2026, జనవరి 26న అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో…
Karthika Deepam 2 Today Episode : ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ ఇవాళ రారని నమ్మకంగా జ్యోత్స్న ఇంటి నుంచి…
Harsha Vardhan : తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ.…
పండ్లు, పాలు వంటి పోషకాహారాలు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అయితే, "ఏది తింటున్నాం" అనే దానికంటే…
This website uses cookies.