TEA | టీని ఇలా తాగితే హెల్త్ డబుల్ .. పుదీనా, లవంగం, జీలకర్ర టీ లాభాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA | టీని ఇలా తాగితే హెల్త్ డబుల్ .. పుదీనా, లవంగం, జీలకర్ర టీ లాభాలు తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :23 October 2025,11:00 am

TEA | వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే వచ్చే ఆ హాయీకి సాటి లేదు. అయితే టీ తాగడం కేవలం అలవాటు కాదు , అది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిపుణుల చెబుతున్న ప్రకారం, సాధారణ టీ డికాషిన్‌తో కాకుండా సహజ పదార్థాలతో చేసిన హెల్తీ టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.

#image_title

ఇక్కడ అలాంటి మూడు హోమ్‌మేడ్‌ స్పెషల్‌ టీలను ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం

పుదీనా టీ (Mint Tea)

పుదీనా ఆకులు అజీర్ణానికి సహజ పరిష్కారం. ఈ ఆకులతో చేసిన టీ నోటి దుర్వాసన, మానసిక అలసట, గ్యాస్‌, బ్లోటింగ్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

తయారీ విధానం:

తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత మూత పెట్టి కొంతసేపు ఉంచి వడకట్టాలి. కావాలంటే తేనె చేర్చుకోవచ్చు.
ప్రయోజనం: జీర్ణక్రియ మెరుగవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

లవంగం టీ (Clove Tea)

లవంగాలు జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులోని యూజీనాల్‌ అనే పదార్థం జీర్ణాశయంలో మంటను తగ్గించి, ఎంజైమ్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
తయారీ విధానం:
కొన్ని లవంగాలను ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. రుచి కోసం అల్లం కూడా కలపవచ్చు.
ప్రయోజనం: జీర్ణశక్తి పెరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

జీలకర్ర టీ (Cumin Tea)

జీలకర్రలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపు సమస్యలను దూరం చేస్తాయి. ఇది అపానవాయువు, అజీర్ణం, గ్యాస్‌ సమస్యలకు సహజ చికిత్స.
తయారీ విధానం:
ఒక టీస్పూన్‌ జీలకర్రను నీళ్లలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి వేడిగా తాగాలి.
ప్రయోజనం: కడుపు సమస్యలు తగ్గుతాయి, ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది