Throat Infection : గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… ఈ చిట్కాలు పాటించండి…!
ప్రధానాంశాలు:
Throat Infection : గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా... ఈ చిట్కాలు పాటించండి...!
Throat Infection : చలికాలం మరియు వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఎంతో మంది జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దానితో పాటుగా ఫ్లూ మరియు జలుబు మన గొంతుని ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాగే అంటువ్యాధి దాడి అనేది పెరిగినప్పుడు గొంతు దృఢత్వం మరియు గొంతు అనేది బొంగురు పోవటం, గొంతు నొప్పి లాంటి ఇతర సమస్యలు వస్తాయి. అయితే వీటిని సహజ నివారణలతో ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
Throat Infection గొంతు మంట
సైనస్ ఇన్ఫెక్షన్ లాంటి ఇతర పర్యవరణ కాలుష్య కారణాల వలన కూడా గొంతు సమస్యలు మనల్ని మరింతగా ప్రభావితం చేస్తాయి. అలాంటి టైం లో గొంతు నొప్పి మరియు గొంతు బొంగురుపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే గొంతుబొంగురు పోయినప్పుడు వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతు బొంగురు పోవడం అనేది తగ్గుతుంది. అంతేకాక ఏలకులు మరియు తేనె కలిపిన పాలను తీసుకుంటే కూడా గొంతు బొంగురు తగ్గుతుంది.
గొంతు నొప్పి : ఫ్లూ మరియు జలుబు లాంటి టైం లో గొంతు నొప్పి అనేది సర్వసాధారణం. ఈ నొప్పితో చాలామంది మాట్లాడలేరు కూడా. అయితే ఈ జలుబు,దగ్గు లాంటి అంటువ్యాధుల వలన గొంతు నొప్పి అనేది వస్తుంది. అయితే ఈ గొంతు నొప్పి అనేది తేలికపాటి చికాకుతో తీవ్రమైనట్లయితే, అప్పుడు వేప ఆకులను నీళ్లలో ఉడికించి తాగినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా తగ్గుతుంది. అలాగే మంటలో బాగా కాల్చినటువంటి లవంగాలను తీసుకున్న గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ గొంతు నొప్పి అనేది తీవ్రమైనట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడడం మంచిది…