Home » Exclusive » Today Corona Updates %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82 %e0%b0%85%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%a8 %e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d %e0%b0%92%e0%b0%95
Exclusive

Today Corona Updates : ప్రమాదం అంచున భారత్.. ఒక్కరోజే 2,47,417 కరోనా కేసులు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 13, 2022, 9:51 am
Advertisement

Today Corona Updates : భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 2 లక్షల 47 వేల 417 కేసులు నమోదయ్యి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక డైలీ పాజిటివీటి రేటు 13.11 శాతంగా నమోదు చేసుకుంది. మరోవైపు రోజు వందల సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5, 488కు చేరుకుంది.

Advertisement

తాజాగా 84 వేల 825 మహమ్మారి నుంచి కోలుకున్నారు. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి

2022 january 13 today corona updates in india

Advertisement

త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా లక్షకు పైగా నమోదు అవుతూ వస్తున్న కరోనా కేసులు నేడు విపరీతంగా 2 లక్షలకు పైగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి