Zodiac Signs : డిసెంబర్ 4 శనివారం ఈరోజు ఈరాశి వారికి కోపతాపాల వల్ల రిలేషన్స్‌ చెడిపోతాయి !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 December 2021, 10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు రావచ్చు. కానీ వాటిని మీరు అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి. అనుకోని నష్టాలు.ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాల్సి రోజు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, వజ్రకవచం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతత లోపిస్తుంది. ఆనవసర ఆందోళనకు గురవుతారు. ఇంట్లో ఒకరికి అనారోగ్యసమస్య రావచ్చు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారానికి ఈరోజు దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆఫీస్‌, ప్రైవేట్ ఉద్యోగలల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ లక్ష్మీ, నారాయణ స్వామి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సంఘటనల ద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ధనం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్త. స్వల్ప అనారోగ్య బాధలు. శ్రీ సూర్యనమస్కారాలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు అందరిచేత గౌరవింప బడుతారు. కుటుంబంలో పరిస్థితులు సంతోషకరంగా ఉంటాయి. సహోదరుల నుంచి సహకారం, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అనవసర విషయాలతో మాత్రం ఈరోజు తల దూర్చకండి. శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి చదవండి లేదా వినండి.

Today horoscope december 4 2021 check your zodiac signs

Today horoscope december 4 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు ఓపిక చాలా అవసరం. కుటుంబంలో అనుకోని మార్పులు రావచ్చు. పక్కవారితో విభేదాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పెద్దల సహకారం తీసుకుంటారు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు అనుకోని వారినుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ధనం అవసరమైనంత లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతారు. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అన్ని రకాల వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫపలాలు : ఈరోజు సంతోషంగా గడుస్తుంది. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఇంట్లో, బయటా పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. చాలా కాలంగా ఉన్న రుణబాధలు తొలగిపోతాయి. పాత స్నేహితులను కలుస్తారు. ప్రయాణ లాభాలు చేకూరుతాయి. శ్రీ హనుమాన్‌ చాలీసా చదువుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ప్రశాంతత లోపిస్తుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక తిరోగమనం కనిపిస్తుంది. ఎవరికి అప్పులు లేదా మాట ఇవ్వకండి. అనారోగ్య బాధలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మీ తెలివి తేటలతో ముందుకు పోతారు. ధైర్యంగా పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి.ప్రయాణాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీవిష్ణు ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు మానసిక ఆందోళన చెందుతారు. ఆఫీస్‌లలో పని వత్తిడి బాగా పెరుగుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కోపతాపాల వల్ల రిలేషన్స్‌ చెడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. శ్రీమహాకాళ, మహాకాళీ ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులను నెమ్మదిగా పూర్తిచేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ప్రవర్తించుకోండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు. వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ రామనామాన్ని జపించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమామిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని వార్తలు విని మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం లభించదు, అనారోగ్య బాధలు, అప్పులు లభిస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచిరోజు. ప్రయాణాలు మంచి పలితాన్నిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం లేదా కనకధార చదవండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి