Kodi Pandalu :సంక్రాంతికి ఏపీలో కోడిపందేల జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పందేలలో కోట్లు పోగొట్టుకున్న వారు లేకపోలేదు. అయితే తాజాగా కోడి పందెం కోసం ఏపీకి వెళ్లిన ఒక సినీ నటుడు అక్కడ లక్షల రూపాయలు పందెంలో ఓడి పోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతను ఏడాదికి పది పదిహేను సినిమాలు చేస్తూ రోజుకు రెండు మూడు లక్షల రూపాయల పారితోషికం అందుకునే ఆ నటుడుగా తెలుస్తుంది. ఇటీవల అతను కమర్షియల్‌గా కూడా మంచి హిట్ దక్కించుకొని వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటున్నాడట.
కెరీర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న సమయంలో ఏపీకి వెళ్లి ఆ నటుడు పాతిక లక్షల రూపాయలను పోగొట్టుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడట.అతడి గురించి తెలిసిన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.ఇలాంటి చెడు అలవాట్లు మానుకోవాలని కూడా హితబోధ చేస్తున్నారట. ఇతనితో పాటు పలువురు ప్రముఖులు కూడా కోడి పందేలలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది ఎంతో జోరుగా సాగే కోడి పందేలలో కొందరికి అదృష్టం వరిస్తే మరి కొందరికి జేబు ఖాళీ అవుతుంది.
కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలోనూ కోడి పందాలు జోరుగా సాగాయి. వీటిని స్ధానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ నిర్వహించారు. ఈ పందేలలో లక్షల రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. అళాగే కోళ్లకు కత్తులు కట్టి మరీ ఈ పందేలు నిర్వహించారు.గోదావరి జిల్లాల్లోనూ దాదాపు ప్రతీ పల్లెలూ పందాలు నిరాటంకంగా సాగాయి. మొన్నటివరకూ పందాలు నిర్వహించరాదని ఆంక్షలు పెట్టిన పోలీసులు.. పండగ వచ్చేసరికి మౌనంగా ఉండిపోయారు. దీంతో పందేలు యథేచ్ఛగా సాగాయి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు కాబట్టి పందాలు నిర్వహిస్తున్నామని పందెం రాయుళ్లు చెప్తున్నారు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.