TTD Chairman : ఏపీ లో కూటమి ప్రభుత్వం చేపట్టాక టీటీడీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అన్న దానికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని వార్తలు రాగా అందులో ఎలా నిజం లేదని తెలుస్తుంది. టీటీడీ అధ్యక్ష పదవి విషయంలో అటు జనసేన, ఇటు బీజేపీ తో కలిసి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఐతే జనసేన, బీజేపీ తరపున కన్నా టీడీపీ నుంచే ఆ పదవి ఎవరికైనా ఇస్తారని అంటున్నారు.టీడీపీ తరపున బాగా వినిపిస్తున్న పేరు విజయనగరం అశోక్ గజపతిరాజు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేశారు. ఈసారి అశోక్ గజపతి రాజు ఎన్నికల్లో పొటీ చేయలేదు. ఆయన కూతురు అదితి గజపతి రాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించాలని చూస్తున్నారు చంద్రబాబు.
టీటీడీ అధ్యక్ష పదవి కోసం మురళి మోహన్, అశ్వనిదత్ లు కూడా రేసులో ఉన్నారని తెలుస్తుంది. మురళి మోహన్ కూడా ప్రత్యక్ష రాజకీయాలు చేశారు. 2009, 20014 లలో లోక్ సభకు పోటీ చేశారు మురళి మోహన్ మొదటిసారి ఓడిపోయినా రెండోసారి గెలిచారు. ఐతే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోపక్క అశ్వనిదత్ కూడా 2004, 2009 అశ్వనిదత్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఇద్దరిలో కూడా ఎవరికో ఒకరికి అధ్యక్స పదవి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఐతే టీటీడీ అధ్యక్ష పదవి అంటే దాదాపు క్యాబినెట్ మినిస్టర్ రేంజ్.. దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. అలాంటి పదవి ఇస్తానంటే ఎవరు వద్దనరు. ఐతే టీడీపీలో వీళ్లే కాకుండా పార్టీని నమ్ముకుని ఉన్న ఇంకా కొంతమంది కూడా ఈ పదవికి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే టీటీడీ అధ్యక్ష పదవి రావాలంటే స్వామి వారి ఆశీర్వాదమే కాదు చంద్రబాబు అభయం కూడా ఉండాలని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.