TV9 Rating : టీవీ-9 రేటింగ్స్ అంతలా పడిపోవడానికి వారి కుట్రలే కారణామా?
TV9 Rating : రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ -9న్యూస్ చానెల్ అత్యంత ప్రజాధారణ పొందినది. దీనిని అంతటి స్థాయిలోకి తీసుకెళ్లింది ఎవరంటే ఎవరైనా టక్కున రవిప్రకాశ్ అని చెబుతున్నారు. ఆయన సీఈవోగా ఉన్నా హయాంలోనే టీవీ9 మంచి రేటింగ్స్‌తో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే,రవిప్రకాశ్‌ను ఆ చానెల్ నుంచి వెళ్లగొట్టాక అందులోని ఆరోగ్యకరమైన పనిచేసే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని అప్పట్లోనే జోరుగా వార్తలు వచ్చాయి.
TV9 Rating : సీనియర్లను పంపడంలో ఎవరి హస్తముంది..
వాస్తవానికి టీవీ9 తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి.. కన్నడ, గుజరాతి, భారత వర్ష అనే ఛానళ్ళు ఏర్పాటవ్వడానికి రవిప్రకాశ్ కృషే కారణం.ఎలా చూసుకున్నా టీవీ9 నెట్వర్క్ దేశంలో 4వ స్థానంలో ఉండేది. ఒక్కోసారి న్యూస్ 18 కూడా వార్తలు అందించడంలో విఫలం అయ్యేదేమో కానీ టీవీ9 ఎప్పుడు లేట్ అయ్యేది కాదు.అంతటి స్ట్రాంగ్ పునాదులను రవిప్రకాశ్ ఏర్పాటుచేశారు. ఇక ఎప్పుడైతే రవి ప్రకాష్‌ను బయటకు పంపారో అప్పుడే దాని పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత మై హోమ్స్ కంపెనీ రావడం.. అందులో భారీగా పెట్టుబడులు పెట్టడం జరిగింది.దీని వెనుక కెసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.ఈ డీల్ వాల్యూ రూ. 550 కోట్లుగా అంచనా. అప్పటిదాకా ప్రైమ్ అవర్స్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా ఉన్న రజనీకాంత్ సీఈవో అయ్యారు.
ఈయన హయాంలోనే టీవీ9 కొత్త ఆఫీసులోకి వెళ్లడం సీనియర్లు అందరినీ బయటకు పంపించడం జరిగాయి. రవిప్రకాశ్ నీడగా భావించి మురళిని కూడా బయటకు పంపించివేశారు. మంచి స్టోరీలు అందించే సీనియర్లను వెళ్లగొట్టారు.ఇలా టీవీ9 పతనానికి చాలా కారణాలున్నాయి. ఇంటర్నల్ పాలిటిక్స్,కుట్రలు కూడా చానల్ రేటింగ్స్ పడిపోవడానికి ఒక ప్రధాన కారణం. ఆ మధ్య దేవి చేసిన రుధిర వ్యాఖ్యలు, విశ్వక్ సేన్ తో వ్యవహరించిన తీరు ఛానల్ పరువును మంటగలిపాయి. దీంతో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు టీవీ9 యాజమాన్యం ఇప్పుడు మురళిని,సీనియర్లు మళ్లీ పిలుస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం బార్క్ రేటింగ్స్ లో టీవీ9 మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి దిగజారింది.