రేవంత్ కొత్త పార్టీ.. ఈటెలకు టచ్ లో ఇద్దరు మంత్రులు… త్వరలో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
Etela Rajendar : తెలంగాణ రాజకీయాల్లో రాబోయే ఆరు నెలల్లో అతి పెద్ద ప్రకంపనలు ఏర్పడబోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ నుండి బలవంతంగా గెంటివేయబడ్డ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవితవ్యం రాష్ట్రంలో కొత్త సమీకరణలకు తెర తీస్తుందని అంటున్నారు. టీఆర్‌ఎస్ లో ఈటెలకు మంచి పట్టు ఉన్న విషయం తెల్సిందే. ఆయన పట్టు కారణంగానే బయటకు పంపిచారనేది కొందరి వాదన. ఆ విషయం పక్కన పెడితే త్వరలోనే ఆయన టీఆర్‌ఎస్ కు పూర్తిగా గుడ్ బై చెప్పి కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని రాజకీయ శక్తులను కూడగట్టుకుని ఈటెల రాజేందర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఈటెలతో మంత్రులు టచ్‌లో..
ఈటెల రాజేందర్ Etela Rajendar తో ఏ ఒక్క మంత్రి కాని ఎమ్మెల్యే కాని చర్చించినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినా కూడా ఇద్దరు మంత్రులు ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. నీకు జరిగిన అన్యాయం పై పోరాటం చేస్తామంటూ వారు హామీ ఇచ్చారట. దీంతో పాటు ఈటెల రాజీయ భవిష్యత్తుకు తాము మద్దతుగా ఉంటామని వారు అన్నారట. సీఎం కేసీఆర్ ఈ విషయం ఇంటిలిజెన్స్ ద్వారా తెలిసిందని సమాచారం అందుతోంది. ఆ మంత్రులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతారా లేదంటే హెచ్చరించి బయటకు పంపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ నుండి కొందరు…
ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్ ను వీడి కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని, ఆ పార్టీలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంకా కొందరు టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ నుండి ఒకరు ఇద్దరు నాయకులు జాయిన్ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి ఈటెలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంటున్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో కీలక రాజకీయ పరిణామం ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. టీఆర్‌ఎస్ నుండి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా ఈటెలకు మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.