Brown Rice : దేశంలో ఎక్కువ శాతం మంది ప్రధాన ఆహారం.. అన్నం. అనేక రాష్ట్రాల్లో రోటిలను బాగా తింటునప్పటికీ.. ఎక్కువ మంది అన్నం తినడానికే ఇష్టపడతారు. అయితే ఈ అన్నంలో ఉండే క్యాలరీలు మనల్ని అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. ఇబ్బందులకు గురిచేస్తాయి. రోజూ తెల్ల అన్నం తింటే బరువు పెరిగడంతో పాటు షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు. అయితే దీనికో పరిష్కారంగా ఉంది. వైట్ రైస్ కు బదులు… బ్రౌన్ రైస్ తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు బోలెడన్నీ ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాల పరంగా చూస్తే వైట్ రైస్ తో పోలిస్తే.. బ్రౌన్ రైస్‌లోనే అధిక పోషకాలుంటాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌లో…. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అయితే వైట్ రైస్‌లో ఈ పోషకాలు ఉండవు.
బ్రౌన్ రైస్ లో ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్, ఫైటిక్ యాసిడ్స్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు ఎక్కువ పనిపెడుతుంది. దాంతో జీర్ణక్రియకు హాని కలిగించే ఫైబర్ కంటెంట్ ను తగ్గించి డైజెస్టివ్ ట్రాక్ ను రక్షిస్తుంది. దీంతో అన్నం తక్కువ తినడం.. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది.
పాలిష్ చేసిన తెల్ల రైస్ కంటే బ్రౌన్ రైస్ షుగర్ వ్యాధి గ్రస్తుల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ కాస్త బ్రౌన్ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట. ఇందులో ఉండే గ్లైసీమిక్ ఇండెక్స్ అందుకు కారణం అంట. బ్రౌన్ రైస్ తిన్న వెంటనే శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల బ్రౌన్ రైస్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుందట. అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్‌ను నిత్యం తినడం వల్ల వారికి భవిష్యత్ లో కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.
రోజూ బ్రౌన్ రైస్ ను తినడం వల్ల గుండె యొక్క ఆరోగ్యం మెరుగు పడుతుందని అంటున్నారు. అలాగే అందులోని రక్త నాళాలు సురక్షితంగా ఉంటాయని అంటున్నారు. బ్రౌన్ రైస్‌లో ఉండే విటమిన్ బి1, మెగ్నిషియంలు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది.
బ్రౌన్ రైస్‌లో ఉండే.. ఐనాసిటాల్ హెగ్జాఫాస్ఫేట్ అనబడే సహజసిద్ధమైన క్యాన్సర్ కు విరుగుడుగా పని చేస్తుంది. దీనిలో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా చుస్తాయని అంటున్నారు.
బ్రౌన్‌రైస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌ని, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయట. అవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయట. అందువల్ల రోజూ బ్రౌన్ రైస్ తింటూ ఉంటే.. మనం నిత్యం యవ్వనంగా కనిపిస్తామని వైద్య నిపుణులు అంటున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.