Nagarjuna : దీప్తి, షన్నూల బ్రేకప్‌ కు పరోక్షంగా నాగార్జున కారణం..!

Nagarjuna : యూట్యూట్‌ క్యూట్ కపుల్‌ గా పేరు తెచ్చుకుని యూత్‌ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్న షన్నూ మరియు దీప్తి సునైనలు విడిపోయారు. వీరిద్దరి మద్య బిగ్ బాస్ చిచ్చు రగల్చడం.. అది కాస్త పెద్దది అయ్యి ఇద్దరి మద్య గొడవ మరింత ముదిరి బ్రేకప్‌ వరకు తెచ్చింది. షన్ను బిగ్ బాస్ లో ఉన్న సమయంలో దీప్తి స్టేజ్ పైకి రావడం ఆ తర్వాత కూడా సోషల్‌ మీడియా ద్వారా షన్నూ కు మద్దతుగా ప్రచారం చేయడం చేసింది. కాని షన్నూ బయటకు వచ్చిన తర్వాత కలిసేందుకు మాత్రం ఒప్పుకోలేదట. దాంతో బిగ్‌ బాస్ గ్రాండ్‌ ఫినాలే షూటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత నేరుగా వైజాగ్‌ కు షన్నూ వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించిన షన్నూకు నిరాశ తప్పలేదు. కొంత స్పేస్ ఇచ్చి మళ్లీ ప్రయత్నిద్దాం అని ఎదురు చూస్తున్న షన్నూకు షాక్‌ ఇచ్చి మేము విడి పోతున్నాం అంటూ దీప్తి సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘమైన పోస్ట్‌ ను పెట్టింది.

దీప్తి పోస్ట్‌ కు షన్నూ తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి సరే విడిపోదాం అంటూ కాస్త ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. ఇదంతా కళ్ల ముందు జరిగింది.. ఈ బ్రేకప్ కు ఎవరికి తోచిన కారణాలు వారు వెదుక్కుంటున్నారు. ఇప్పుడు కొందరు దీప్తి షన్నూలు విడిపోవడంకు కారణాల్లో నాగార్జున కూడా ఒకరు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. షన్నూ మరియు దీప్తిల బ్రేకప్ కు ప్రథాన కారణంగా సిరితో బిగ్‌ బాస్ లో షన్నూ వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో ఆమెను భార్య కంటే ఎక్కువగా కంట్రోల్‌ చేయడం.. కాస్త ఓవర్‌ గా ఆమె పై ట్రిప్ అవ్వడం వంటివి షన్నూ చేయడం జరిగింది. అయితే సీజన్ ప్రారంభంలో సిరికి చాలా దూరంగానే షన్నూ ఉన్నట్లుగా కనిపించాడు. షన్నూ మరియు సిరిలు కలిసి ఆడేస్తున్నారు అంటూ కొందరు విమర్శలు చేసిన సమయంలో షన్నూ ఆమెను పూర్తిగా అవైడ్ చేసేలా వ్యవహరించాడు. అందుకోసం ఒక వారం గట్టిగానే ప్రయత్నించాడు. అప్పుడు సిరి కూడా చాలా బాధ పడింది.

nagarjuna reason for deepthi sunaina and shanmukh breakup

Nagarjuna : నాగార్జున  సలహా కాస్త ఇప్పుడు బ్రేకప్ వరకు…!

ఆ సమయంలో వీకెండ్‌ ఎపిసోడ్‌ లో నాగార్జున వచ్చి మీరు మంచి స్నేహితులు.. ఎవరో ఏదో అన్నారని ఎందుకు మీరు దూరం అవుతున్నారు.. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి అంటూ సలహా ఇచ్చాడు. ఆ సలహా కాస్త ఇప్పుడు బ్రేకప్ వరకు తీసుకు వచ్చిందని కొందరు చర్చిస్తున్నారు. నాగార్జున ఆ రోజు అలా మాట్లాడి ఉండకుంటే సిరి మరియు షన్నూలు ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండేవారు. అలా ఉండటం వల్ల సిరి కాస్త ముందుగానే ఎలిమినేట్‌ అయ్యేది. దాంతో షన్నూ సోలోగా ఆడి ట్రోఫీని దక్కించుకునేవాడేమో. సిరి తో షన్నూ రిలేషన్‌ హౌస్‌ లో అంతగా లేకుండా ఉంటే ఇప్పుడు దీప్తి సునైనతో చక్కగా మరో సిరీస్ లేదా ఆల్బం చేసుకుంటూ షన్నూ ఉండేవాడు. కాని ఆ రోజు నాగార్జున చెప్పిన సలహా.. ఇచ్చిన హింట్‌ వల్లే ఇప్పుడు పచ్చని ప్రేమ బుగ్గిపాలయ్యిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీప్తి మరియు షన్నూల అభిమానులుగా వారి ఆవేదన ఉండటం కామన్‌. కాని బ్రేకప్‌ కు విశ్లేషించే సమయంలో అర్థం పర్థం లేని ఆలోచనలు పెట్టుకోక పోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవతలి వారు ఏం చెప్పినా ఎంత వరకు తీసుకోవాలో అంత వరకే తీసుకోవాలి. నాగార్జున స్నేహితులుగా మాత్రమే ఉండమన్నాడు.. మరి ఎందుకు కాస్త ఎక్కువ చేశారంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ బ్రేకప్‌ నిజంగా కాస్త బాధను కలిగించేదే.. వారి వ్యక్తిగత విషయాల్లో మరింత జోక్యం అవసరం లేదు. కనుక దాని గురించి సోషల్ మీడియాలో తగ్గిస్తే బెటర్ అని మా అభిప్రాయం.

Recent Posts

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

51 minutes ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

5 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

8 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

10 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

22 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

1 day ago