Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం జరిగింది. ఇప్పటికే దేశం మొత్తం ఆ రైళ్లు తిరుగుతున్నాయి. ఈ సెమీ హై స్పీడ్ రైల్ సర్వీసులను బీజేపీ ప్రవేశ పెట్టింది. ఐతే ఇప్పుడు వాటికి కొత్త మార్గాలను అనుసరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న వాటితో పాటుగా మరో 60 వందే భారత్ రైల్ లను తీసుకొస్తుంది. ఆదివారం ప్రధాని మోడీ ఆరు కొత్త వందే భారత్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 September 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం జరిగింది. ఇప్పటికే దేశం మొత్తం ఆ రైళ్లు తిరుగుతున్నాయి. ఈ సెమీ హై స్పీడ్ రైల్ సర్వీసులను బీజేపీ ప్రవేశ పెట్టింది. ఐతే ఇప్పుడు వాటికి కొత్త మార్గాలను అనుసరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న వాటితో పాటుగా మరో 60 వందే భారత్ రైల్ లను తీసుకొస్తుంది. ఆదివారం ప్రధాని మోడీ ఆరు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. రోజు రోజుకి వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుంది. పండగ సీజన్లలో టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎక్కువ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. వీటితో పాటు వందే మెట్రోల్ రైళ్లను కూడా ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తున్నారు. గుజరాజ్ లోని భుజ్ అహ్మాదాబాద్ మధ్య మొదటి వందే మెట్రో ఎక్స్ ప్రెస్ మొదలు పెడుతున్నారు. ప్రధాని మోడీ ఈ రైల్ ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అంతేకాదు కొన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

Namo Bharath Rapid Rail నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా..

వందే మెంట్రో సర్వీస్ రైల్ పేర్లను కేంద్రం నమో భారత్ ర్యాపిడ్ రైల్ గా మార్చింది. ఈ పేరుతోనే ఈ ర్యాపిడ్ రైల్ సిస్టం నడుస్తుంది. భుజ్ అహ్మదాబా మధ్య 359 కిలోమీటర్ల దూరం ఉంది. వందే మెట్రోల్ ట్రైన్ లో 5 గంటల 45 నిమిషాల టైం పడుతుంది. 455 రూపాయల టికెట్ ప్రైజ్. ఇది 110 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్తుంది.

Namo Bharath Rapid Rail ఇక నుంచి వందే భారత్ కాదు వందే మెంట్రో

Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

మామూలు మెట్రో రైల్ తో ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఒకేసారి 1150 మంది ప్రయాణించగలిగే సత్తా ఉంటుంది. టికెట్ తో పాటు భోజన సదుపాయం కూడా ఉంటుంది. రాబోయే 35 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వందే మెట్రో రైల్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది