Vastu Tips | చనిపోయిన వ్యక్తుల ఫొటోలు పెట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయోద్దు..!
Vastu Tips | మన ఇళ్లలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం సాధారణం. వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోలు ఇంట్లో ఉంచడం శుభప్రదమే. అయితే కొన్ని ప్రత్యేక నియమాలు పాటించకపోతే దురదృష్టకర ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

#image_title
పాటించాల్సిన వాస్తు నియమాలు:
1. ఇంటి మధ్యలో పెట్టకూడదు
పూర్వీకుల ఫోటోలను బ్రహ్మస్థానంలో, మెట్ల కింద, స్టోర్ రూమ్‌లో ఉంచరాదు. ఇలా చేస్తే కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
2. పూజా గదిలో ఉంచరాదు
పూర్వీకుల ఫోటోలను పూజా గదిలో దేవుని విగ్రహాలు లేదా చిత్రాలతో పాటు ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభకరం.
3. గోడలపై వేలాడదీయరాదు
చనిపోయిన వారి ఫోటోను నేరుగా గోడలపై వేలాడదీయకుండా, చెక్క స్టాండ్ లేదా టేబుల్‌పై ఉంచడం శ్రేయస్కరం.
4. దక్షిణ దిశలో ఉంచాలి
పూర్వీకుల ఫోటోలను దక్షిణ దిశలో ఉంచడం ఉత్తమం. అలాగే ఉత్తర దిశలో ఉంచినా ఫోటో ముఖం ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉండాలి.
5. బెడ్‌రూమ్, వంటగది వద్ద ఉంచరాదు
పూర్వీకుల ఫోటోలను బెడ్‌రూమ్‌లో, వంటగదిలో, బాత్రూమ్ సమీపంలో ఎప్పుడూ ఉంచరాదు. ఇది అశుభకరంగా పరిగణించబడుతుంది.
మొత్తంగా, పూర్వీకుల చిత్రాలను గౌరవప్రదంగా, సరైన దిశలో, వాస్తు నియమాలను పాటిస్తూ ఉంచితే ఇంట్లో శాంతి, శుభం నిలుస్తాయని నమ్మకం.