Categories: NewsTrending

Veg Bhurji Recipe : ఎగ్ వాడకుండా ఎగ్ బుర్జీ.. అది ఎలాగో చూద్దాం…

Veg Bhurji Recipe : ఎగ్ బుర్జి చాలామంది ఇష్టపడి తింటుంటారు. దీనిని ఎక్కువగా చపాతి, పుల్కాలు, రోటీల్లో కి బాగా తింటుంటారు. దీనిని ఎక్కువగా రెస్టారెంట్లలో బాగా చేస్తూ ఉంటారు. అయితే కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు ఎగ్ వాడకుండా బుర్జి చేయడం ఎలాగో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ,జీలకర్ర, ఉల్లిపాయలు, ఆయిల్,ఎల్లుల్లి, కొత్తిమీర,టమాటాలు మొదలైనవి..

తయారీ విధానం: ముందుగా ఓ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శెనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి ,కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా జారుగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఎల్లుల్లి సన్నగా తరిగినవి రెండు స్పూన్లు, ఒక స్పూన్ జీలకర్ర ,నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి. తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అరకప్పు టమాటా ముక్కలు సన్నగా తరిగినవి వేసి పదినిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దానిలోకి రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ ,ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, వేసి బాగా కలుపుకోవాలి.

Veg Omelette Bhurji recipe in Telugu video on youtube

ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమాన్ని ఫ్యాన్ లో చుట్టూ ఆమ్లెట్ల పోయాలి. తరువాత దానిని కదపకుండా అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. తర్వాత చిన్నగా చిన్న చిన్న ముక్కలయ్యేలా కదుపుతూ ఉండాలి. దానిని బాగా గరిట పెట్టి తిప్పకూడదు. పది నిమిషాలు అలాగే పూర్తిగా ఉడకనివ్వాలి తరువాత చిన్న చిన్న ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేవరకు వేయించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే ఎగ్ వాడకుండా బుర్జి రెడీ..

Recent Posts

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

25 minutes ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago