Veg Bhurji Recipe : ఎగ్ వాడకుండా ఎగ్ బుర్జీ.. అది ఎలాగో చూద్దాం…

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 17, 2022, 7:40 am

Veg Bhurji Recipe : ఎగ్ బుర్జి చాలామంది ఇష్టపడి తింటుంటారు. దీనిని ఎక్కువగా చపాతి, పుల్కాలు, రోటీల్లో కి బాగా తింటుంటారు. దీనిని ఎక్కువగా రెస్టారెంట్లలో బాగా చేస్తూ ఉంటారు. అయితే కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. అలాంటివారికి ఇప్పుడు ఎగ్ వాడకుండా బుర్జి చేయడం ఎలాగో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ,జీలకర్ర, ఉల్లిపాయలు, ఆయిల్,ఎల్లుల్లి, కొత్తిమీర,టమాటాలు మొదలైనవి..

తయారీ విధానం: ముందుగా ఓ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శెనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి ,కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా జారుగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఎల్లుల్లి సన్నగా తరిగినవి రెండు స్పూన్లు, ఒక స్పూన్ జీలకర్ర ,నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి. తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అరకప్పు టమాటా ముక్కలు సన్నగా తరిగినవి వేసి పదినిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దానిలోకి రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ ,ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, వేసి బాగా కలుపుకోవాలి.

Veg Omelette Bhurji recipe in Telugu video on youtube

Veg Omelette Bhurji recipe in Telugu video on youtube

ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమాన్ని ఫ్యాన్ లో చుట్టూ ఆమ్లెట్ల పోయాలి. తరువాత దానిని కదపకుండా అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. తర్వాత చిన్నగా చిన్న చిన్న ముక్కలయ్యేలా కదుపుతూ ఉండాలి. దానిని బాగా గరిట పెట్టి తిప్పకూడదు. పది నిమిషాలు అలాగే పూర్తిగా ఉడకనివ్వాలి తరువాత చిన్న చిన్న ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేవరకు వేయించుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే ఎగ్ వాడకుండా బుర్జి రెడీ..

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp