Pawan Kalyan : వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి తీరు చాలా విభిన్నంగా ఉంటుంది, ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతీది కూడా వివాదాస్పదం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆ పార్టీ వారికి విజయ సాయి రెడ్డి యొక్క ట్వీట్ లు నచ్చినా.. మిగతా వాళ్ళందరికీ కూడా కాస్త కటువుగా అనిపిస్తాయి. ఆయన ట్వీట్ చేసే ప్రతి అంశం కూడా ఎక్కువ శాతం వివాదాస్పదం అవుతుంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఎంపీ విజయ సాయి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క పోస్టర్ ని షేర్ చేశాడు. కేవలం పోస్టర్ షేర్ చేస్తే వివాదం ఏం లేదు.. కానీ కాస్త విభిన్నంగా స్పందించాడు. గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం జిల్లాలో జరగబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు అంటూ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశాడు. అంతే కాకుండా నాలుగున్నర దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా ఉండడం ఒక గొప్ప విషయం అన్నట్లుగా పొగడ్తల వర్షం కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రారాజు.. ఆయన తర్వాతే మిగతా వాళ్ళు అన్నట్లుగా విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొద్దున లేస్తే విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్లో లేదా బయట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శల తో ముంచెత్తుతుంటాడు.. అలాంటి విజయ సాయి రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క అన్న చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ తనదైన రాజకీయం చేస్తున్నాడంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
విజయ సాయి రెడ్డి ఈ రాజకీయం ఏంటో అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆయన ట్వీట్ కి కామెంట్ చేస్తున్నారు. మరో వైపు కొందరు మెగాస్టార్ చిరంజీవిని వైకాపా వారు మెల్లగా తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారికంగా పార్టీలో జాయిన్ అవ్వకుండా ఎన్నికల సమయంలో ప్రచారంకు వచ్చినా చాలు అన్నట్లుగా ప్రాధేయ పడుతున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి విషయంలో వైకాపా నాయకులు ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటున్నారు. ఆ మధ్య వైయస్ జగన్ కూడా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చిరంజీవి కోరినట్లుగా టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ముందు ముందు వైకాపా వారు మరింతగా చిరంజీవి ని పొగడ్తల వర్షం లో ముంచేత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.