Home » Entertainment » Vijayashanti Going To Do A Key Role In Jr Ntr Upcoming Movie
Entertainment

Vijayashanti  : బీజేపీ పక్కన పెట్టడంతో మళ్లీ సినిమాల్లోకి రాములమ్మ.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి పండగే!

Authored By
aruna
The Telugu News | Updated on: September 5, 2022 6:41 pm
Advertisement

Vijayashanti  : లేడీ అమితా బచ్చన్ గా.. లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న విజయశాంతి రాజకీయాల్లో మొదట్లో వెలుగు వెలిగింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రల్లో కనిపించింది, కానీ ఇప్పుడు ఆమె రాజకీయం కష్టాల్లో పడినట్లు అయింది. అనేక పార్టీలు మారిన విజయశాంతి ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో బిజెపిలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పుడు మాత్రం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణలో బిజెపి దూసుకు పోతుంది. ఈ సమయంలో ఆమె పార్టీలో క్రియాశీలకంగా ఉండాల్సింది పోయి కనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్లే అనేది ఆమె వాదన. ఏ కార్యక్రమం జరిగిన తనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోవడం లేదని తన యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం లేదు అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపిలో ఎలాగూ తనను పట్టించుకోవడం లేదు కనుక సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాట్లుగా పుకార్ల షికార్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో కీలక పాత్రలో విజయశాంతి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ వరుసగా ఆఫర్లు వచ్చినా కూడా అన్నింటిని సున్నితంగా తిరస్కరించింది. కానీ ఎట్టకేలకు ఆమె మళ్ళీ ఒక సినిమాకు కమిట్ అయింది.

Vijayashanti going to do a key role in Jr NTR upcoming movie

Advertisement

ఎన్టీఆర్ అంటే విజయశాంతికి అభిమానం.. ఆ అభిమానంతోనే ఆయన నటించబోతున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ఏంటి, విజయశాంతిని ఒప్పించిన ఆ దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. కానీ ఖచ్చితంగా ఆమె ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా లో కనిపించబోతున్నది అనే మాట మాత్రం వాస్తవం అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రాజకీయాల్లో పట్టించుకోక పోవడం వల్లే మళ్ళీ సినిమా వైపు విజయశాంతి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి గుసగుస.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి