Home » Entertainment » Vikram Prabhu Reveals He Missed Gona Ganna Reddy Role
Entertainment

Allu Arjun | నేను చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేసి హిట్ కొట్టారు.. యంగ్ హీరో కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: August 31, 2025 10:42 am
Advertisement

Allu Arjun | సినీరంగంలో కొందరు స్టార్స్ చేయాల్సిన సినిమాలు మరొకరి ఖాతాల్లోకి వచ్చిపడ్డాయి. కొన్నిసార్లు పలు చిత్రాలు భారీ విజయాన్ని అందుకోగా.. మరికొన్ని సినిమాలు మాత్రం అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. తాజాగా ఈ యంగ్ హీరో తాను మిస్సైన సూపర్ హిట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బయటపెట్టారు. తాను చేయాల్సిన ఓ సినిమాతో అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నారని… ఆ పాత్రలో బన్నీ యాక్టింగ్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ హీరో పేరు విక్ర‌మ్ ప్రభు.

Advertisement

#image_title

ఇంట్రెస్టింగ్ విష‌యాలు..

Advertisement

విక్రమ్ ప్రభు.. ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. తెలుగు, తమిళం ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించిన ప్రభు కుమారుడే విక్రమ్ ప్రభు. తమిళంలో హీరోగా కొనసాగుతున్న ఆయన.. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటించిన తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వ్చచింది. ఇక ఇప్పుడు తెలుగులో మొదటి సారి విక్రమ్ ప్రభు నటిస్తోన్న సినిమా ఘాటీ. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ ప్రభు.. గతంలో తాను అనుష్కతో ఓ సినిమా చేయాల్సి ఉందని.. కానీ మిస్సైందని చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం డైరెక్టర్ గుణశేఖర్ ముందుగా తనను సంప్రదించారని.. మూడు నెలలు డేట్స్ కావాలని అడిగారని.. కానీ అప్పుడే తాను వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో చేయలేకపోయానని స్ప‌ష్టం చేశారు. కానీ అల్లు అర్జున్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని.. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి