
Viral News bride groom treated badly with bride
Viral News : పెళ్లి కల వచ్చిందంటే ఎవ్వరూ ఆగరు. ముఖ్యంగా పెళ్లిచూపులు చూసినప్పటి నుంచి పెళ్లి అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు పెళ్లి అవుతుందా అని అందరూ వెయిట్ చేస్తుంటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్లి అంటేనే నూరేళ్లు పంట అని అనుకుంటారు. పెళ్లి తర్వాత జరగబోయే పనుల గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు. కానీ.. పెళ్లి తర్వాత వచ్చే సమస్యల గురించి ముందే పట్టించుకోరు. కొందరు పెళ్లికి ముందే తొందరపడుతుంటారు. కొందరు అస్సలు ఆపుకోలేరు. అలా ఓ పెళ్లి కొడుకు పెళ్లి అయ్యేంత వరకు ఆపుకోలేక అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు పెళ్లి క్యాన్సిల్ అవడమే కాదు.. ఆ పెళ్లి కొడుకు జైలుకు వెళ్లేంత పని అయింది.
Viral News bride groom treated badly with bride
అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన లక్ష్మీ నరసింహ అనే వ్యక్తి పెళ్లి జరగాల్సి ఉంది. సోమవారం పెళ్లి. ఆదివారం రాత్రి తన ఫ్రెండ్స్ కు, బంధువులకు ఫుల్ పార్టీ ఇచ్చాడు లక్ష్మీ నరసింహం. అందరితో పాటు తను కూడా మద్యం సేవించాడు. మద్యం సేవించిన వాడు ఊరికే ఉండక.. ఇంత తిని తొంగోక.. వధువు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లాడు. తెల్లవారితే పెళ్లి అని కూడా మరిచిపోయిన ఆ పెళ్లికొడుకు.. వధువును ఇష్టం ఉన్నట్టుగా తిట్టారు. పెళ్లి కూతురు తరుపు బంధువులు, కుటుంబ సభ్యులతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.
Viral News bride groom treated badly with bride
దీంతో ఈ తాగుబోతుతో తాను కాపురం చేయాలా? ఇలాంటోని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడాలా అని అనుకున్న పెళ్లి కూతురు.. అతడితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అంతే కాదు.. తప్ప తాగి తనను, తన ఫ్యామిలీ మెంబర్స్ పై అసభ్యంగా ప్రవర్తించాడని వధువు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో తెల్లవారితే పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి కోసం వధువు తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు మొత్తం పెళ్లికొడుకు తల్లిదండ్రులు.. తిరిగి ఇచ్చేయాలని పెద్దమనుషులు కూడా తీర్మానం చేశారు. అటు పెళ్లి పాయె.. పరువు పాయె.. డబ్బు పాయె.. చివరికి చిప్ప కూడు గతి ఆయె. మద్యం ఎంత పని చేసిందో చూశారా?
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
This website uses cookies.