Viral News : రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల.. దాన్ని చూడటానికి క్యూ కట్టిన జనాలు.. అమావాస్య ముందు అరిష్టమా?
Viral News : బ్రహ్మం గారు ఎప్పుడో తన కాలజ్ఞానంలో చాలా విషయాలు రాశారు. అవన్నీ ఇప్పుడు నిజం అవుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చూసి అప్పట్లో జనాలు నవ్వుకున్నారు. ఎందుకంటే.. వాటిని చూసి ఎవ్వరూ నమ్మలేదు. కానీ.. ఇప్పుడు అవన్నీ నిజం అవుతున్నాయి. తాజా ఘటనను చూస్తే అదే అనిపిస్తుంది. ఈ వింత ఘటనను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఎందుకంటే.. రెండు తలలతో ఓ గొర్రెపిల్ల జన్మించింది. ఆ వింత గొర్రె పిల్ల గురించి తెలుసుకున్న జనాలు తండోప తండాలుగా దాన్ని చూడటానికి తరలి వస్తున్నారు. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంపనబోయిన వెంకన్న అనే రైతు పెంచుకున్న గొర్రెకే ఈ రెండు తలల గొర్రెపిల్ల పుట్టింది. ఈ గొర్రె పిల్ల ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉందట. తన రెండు తలలతో అది మేత మేస్తోందట.
Viral News : జన్యులోపం వల్ల జన్మించిందా?
పలువురు మూడనమ్మకాలను నమ్మేవారు మాత్ర అమావాస్య ముందు ఇలా రెండు తలలతో పుడితే గ్రామానికే అరిష్టం అని అంటున్నారు. కానీ.. ఇది కేవలం జన్యులోపం వల్ల ఇలా రెండు తలలతో గొర్రెపిల్లలు జన్మిస్తాయని పశు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ గొర్రెపిల్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కలికాలం కాకపోతే.. ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.