
Viral News The flight that was stopped six hours because lovers chatting
Viral News : విమానాల్లో భద్రత విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు సిబ్బంది. ఏ చిన్న అనుమానం వచ్చినా ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మరి చెక్ చేస్తుంటారు.. నిఘా విభాగం ఎప్పుడూ ఎప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటుంది. అయితే ఒక్కోసారి భధ్రత విషయంలో అతి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరుతుంటాయి.. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.. అయితే విమానాల్లో ప్రయాణించే వ్యక్తులు ప్రవర్తించే తీరు వల్ల కూడా కొన్ని సార్లు ఆలస్య అవుతుంది. అయితే పొరపాటున విమానాశ్రయంలో గానీ.. ఫ్లైట్ లో గానీ.. బాంబ్ వంటి మాటలు ఎవరి నోటినుంచి వచ్చినా అందరు కంగారు పడతారు.. సరదాగా మాట్లాడుకున్నా ఒక్కోసారి విషయం సీరియస్ అవుతుంది.. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
సమయానికి బయలుదేరాల్సిన ఓ విమానం లవర్స్ కారణంగా ఏకంగా ఆరు గంటలు ఆగిపోయింది. ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్ చాటింగ్ సంభాషణ.. 185 మందిని భయభ్రాంతులకు గురిచేసింది. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు నిలిపేసింది. అదేలా అనుకుంటున్నారా.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. కాగా అతను ముంబయి వెళ్లేందుకు.. ఆ అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఇక అమ్మాయి తన విమానం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.. ఈ క్రమంలో బోర్ కొట్టి ప్రియుడికి మెసేజ్ పెట్టింది. ఇద్దరూ చాట్ చేసుకుంటుండగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలో నువ్వే ఓ బాంబర్.. అంటూ ఆ అమ్మాయి అతనికి మెసేజ్ పెట్టింది.
Viral News The flight that was stopped six hours because lovers chatting
అయితే ఈ మెసేజ్ అతని వెనుక సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికురాలి చూసింది. దీంతో భయాందోళనకు గురైన ఆ ప్రయాణికురాలు వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చింది. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. వెంటనే భద్రదత సిబ్బంది ప్రయాణికులందరినీ దించేసి తనిఖీలు చేపట్టారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు లవర్స్ చేసుకున్న చాటింగ్ వల్ల ఏకంగా ఓ ఫ్లైట్ ఆరు గంటలు ఆలస్యం అయిందంటే నవ్వొచ్చేస్తోంది కదూ.. ఒక్కోసారి అలా జరుగుతుంటాయి మరి.. మీరు కూడా ఎప్పుడూ అలా చేయకండి…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.